పార్వతీపురం టౌన్: జిల్లాలోని 67 పరీక్ష కేంద్రాల్లో తొలిరోజు సోమవారం ప్రారంభమైన తెలుగు పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఉదయాన్నే ఇష్టదైవాలకు పూజలు చేసి గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. తొలిరోజు కావడంతో విద్యార్థుల వెంట తల్లిదండ్రులు పరీక్ష కేంద్రాలకు వచ్చారు. జాగ్రత్తలు చెప్పి సాగనంపారు. రెగ్యులర్ పరీక్షకు 10,366 మందికి 10,322 మంది హాజరయ్యారు. 44 మంది గైర్హాజరయ్యారు. ప్రైవేటు విద్యార్థులు 17 మందికి 14 మంది హాజరయ్యారు. జిల్లాలోని పలు పరీక్ష కేంద్రాలను కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్, ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా విద్యాశాఖాధికారి ఎన్. తిరుపతిరావు తనిఖీ చేశారు.
ప్రశాంతంగా తొలిరోజు పరీక్ష