● పార్వతీపురం పట్టణానికి చెందిన బొత్స కామేష్ 2022 సెప్టెంబర్ నెల 15వ తేదీన పట్టణంలో బాలికపై లైంగిక దాడి చేశాడని బాలిక తల్లి పార్వతీపురం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితునికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 4వేలు జరిమానా విధించారు.
● సీతంపేట మండలం సోమగండి గ్రామానికి చెందిన ఏనిమిదేళ్ల బాలికపై గంటా సంతు 2018లో లైంగిక దాడి చేశాడని అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసుపై శ్రీకాకుళం ఫస్ట్ ఏడీజే, ఎఫ్‌ఏసీ పోక్సో కోర్టు విచారించి సంతుకు 20 సంవత్సరాల జైలుశిక్ష, రూ.5వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.
● 2022వ సంవత్సరంలో పార్వతీపురం పట్టణానికి చెందిన రొంపల్లి రామకృష్ణ పదో తరగతి చదువుతున్న తన కుమార్తె, ఆమె స్నేహితురాలిపై లైంగిక దాడి చేశాడని కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి డీఎస్పీ సుభాష్ కేసు నమోదు చేశారు. నిందితుడిపై నేరం రుజువు కావడంతో విజయనగరం పోక్సో కోర్టు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.4లక్షల జరిమానా విధించింది.
కఠిన చర్యలు
మహిళలపై అసభ్యకరంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తప్పవు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో బస్టాండ్‌లు, ప్రధాన కూడళ్ల వద్ద బందోబస్తును ఏర్పాటు చేశాం. మహిళా రక్షణకు ప్రతీ ఒక్కరి మొబైల్‌లో దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేయిస్తున్నాం. ప్రతీ నెల దిశ యాప్ డౌన్‌లోడ్ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. మహిళలపై లైంగిక దాడులకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయడమే కాకుండా శిక్ష తొందరగా పడేలా కోర్టులకు సంబంధిత పత్రాలను అందజేస్తున్నాం. జిల్లాలో ఇప్పటి వరకు ఐదు పోక్సో కేసుల్లో 20ఏళ్ల జైలుశిక్ష కోర్టు విధించింది.
– విక్రాంత్ పాటిల్, ఎస్పీ,
పార్వతీపురం మన్యం జిల్లా
పార్వతీపురం టౌన్: మహిళల భద్రతే లక్ష్యంగా ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా మన ఇంట్లో ఏం సమస్య ఉంది...? ఆడపిల్లలు కళాశాలలకు వెళ్లే దారిలో ఏమైనా ఇబ్బంది పడుతున్నారా...? ఆకతాయిల వేధింపులను పోలీసుస్టేషన్ మెట్లు ఎక్కి చెప్పే దైర్యం లేకుంటే...? ఈ దిగులు గుండెల్లోనే ఆగిపోవాల్సిందేనా...? అంటే కాదంటున్నారు పార్వతీ పురం మన్యం జిల్లా పోలీసులు. మహిళలందరూ సంతోషంగా ఉండాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పోలీసు వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. ప్రతీ పోలీసుస్టేషన్‌లో మహిళా రక్షక్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ప్రతీ సచివాలయ పరిధిలో మహిళా పోలీసులను నియమించారు. ప్రతీ జిల్లాలో దిశ మహిళా పోలీసుస్టేషన్లను ఏర్పాటు చేసి మహిళ భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. దిశ పోలీసుస్టేషన్ల ద్వారా మహిళలపై లైంగిక వేధింపులకు గురి చేసే వారిపై కేసులు నమోదు చేసి సత్వరమే బాధితులకు న్యాయం చేకూరేలా ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ద్వారా నిందితులకు శిక్షలు పడేలా చర్యలు చేపట్టారు. పార్వతీపురం మన్యం జిల్లాలో మహిళలను లైంగికంగా వేధించే వారిపై ఇప్పటి వరకు 32కేసులు నమోదు చేశారంటేనే పోలీసులు ఎంత చాకచక్యంగా ఈ కేసుల్లో వ్యవహరిస్తున్నారో తెలుస్తోంది.
32 కేసులు
మహిళలను వేధించినా, లైంగిక దాడికి పాల్పడిన అటువంటి వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. తమకు అన్యాయం జరిగిందని పోలీసుస్టేషన్‌కు వెళ్లిన మహిళలకు న్యాయం చేకూరేలా చర్యలు చేపట్టారు. 2023 జనవరి నుంచి పార్వతీపురం మన్యం జిల్లాలో మహిళలపై వేధింపులు, లైంగిక దాడులకు పాల్పడిన వారిపై 32 కేసులను నమోదు చేశారు. బాధితులకు తక్షణమే న్యాయం చేకూరేలా పూర్తి చర్యలు చేపట్టారు. కోర్టుల్లో కేసులు త్వరగా ట్రైల్‌కు వచ్చేలా ఎవిడెన్స్‌లను అందజేస్తున్నారు. జిల్లాలో ఐదు కేసుల్లో సంవత్సరంలోగా ఐదుగురు ముద్దాయిలకు యావజ్జీన కారాగార శిక్ష విధించారు.
న్యూస్‌రీల్
ఆపదలో మహిళలకు తక్షణ సాయం
ఆపదలో చిక్కుకున్న మహిళలు సాయం కోరిన వెంటనే అక్కడకు చేరుకొని రక్షణ కల్పించే వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించింది. అదే దిశ మొబైల్ యాప్. ఈ దిశ యాప్‌పై మహిళలకు, విద్యార్థులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పి స్తూ ప్రతీ నెల దిశ యాప్ డౌన్‌లోడ్ స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఇప్పటి వరకు 80,321 మంది మొబైల్స్‌లో దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేయించారు. ఇప్పటి వరకు దిశకు 3,490 ఎస్‌ఓఎస్ కాల్స్ వచ్చాయి. 67మందికి దిశ కౌన్సెలింగ్ ఇచ్చారు. పది మందిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. దిశకు వచ్చిన ఎస్‌ఓఎస్ కాల్స్‌పై స్పందించి తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకొని ఆపదలో ఉన్న మహిళలకు అండగా నిలుస్తున్నారు.
మహిళల రక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యం
ఆపదలో ఉన్న మహిళలకు తక్షణ సాయం
జిల్లాలో మహిళలను వేధించిన వారిపై నమోదైన కేసులు 32
జిల్లాలో నమోదైన పోక్సో కేసులు 24
ఆరు నెలల్లో ఐదుగురికి యావజ్జీవ శిక్ష
గుడ్ టచ్... బ్యాడ్ టచ్‌లపై అవగాహన
6–11 ఏళ్ల మధ్య వయసున్న అమ్మాయిలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌ల పేరున ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఆత్మ రక్షణకు ప్రత్యేక సందర్భాల్లో ఎలా స్పందించాలో నేర్పిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే బాలికలకు చదువు, పెళ్లిలాంటి విషయాలపైన, మహిళ హక్కులపైన అవగాహన తరగతులను నిర్వహిస్తున్నారు. ఉన్నత విద్య చదువుకోవాలన్న వారికి అవగాహన కార్యక్రమాలు అందించడంతో పాటు వివిధ సమస్యలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
పార్వతీపురం పట్టణంలో దిశ యాప్ డౌన్‌లోడ్ కార్యక్రమం (ఫైల్)
అభివృద్ధి పనులపై ఆరా తీస్తున్న ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర


