పల్నాడు | - | Sakshi
Sakshi News home page

పల్నాడు

Oct 2 2026 2:57 AM | Updated on Oct 2 2026 2:57 AM

శుక్రవారం శ్రీ 2 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026 బలహీన వర్గాలకు టీడీపీ వెన్నుపోటు నిమ్మకాయల ధరలు నాగార్జునసాగర్‌ నీటిమట్టం పులిచింతల సమాచారం నిరాశ్రయుల కోసం ప్రత్యేక ఓటరు డెస్క్‌లు

న్యూస్‌రీల్‌

రాజ్యాంగ సవరణతోనే 34 శాతం రిజర్వేషన్లు

బీసీ రిజర్వేషన్లపై సర్కారుకు హైకోర్టు షాక్‌ చట్ట సవరణ అంశాలను జీఓలతో కప్పిపుచ్చిన ప్రభుత్వం బీసీలపై సర్కారు చిత్తశుద్ధిపై సర్వత్రా విమర్శలు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఉమ్మడి జిల్లాలో ఒక్క బీసీకి కూడా నామినేట్‌ పదవి ఇవ్వని వైనం ఇచ్చిన పదవుల్లో 95 శాతం చంద్రబాబు సామాజిక వర్గానికే.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీసీ రిజర్వేషన్‌ మార్చే కుట్ర టీడీపీలోని బీసీలనూ అణగదొక్కేయత్నం

రిజర్వేషన్ల పేరుతో బీసీలను మోసగించే యత్నం

వైఎస్సార్‌ సీపీ హయాంలో పెద్ద పీట

శుక్రవారం శ్రీ 2 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026
బలహీన వర్గాలకు టీడీపీ వెన్నుపోటు

7

తెనాలి: తెనాలి మార్కెట్‌యార్డులో గురువారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.6500, గరిష్ట ధర రూ.9000, మోడల్‌ ధర రూ.8000 వరకు పలికింది.

మాచర్ల: నాగార్జునసాగర్‌ నీటిమట్టం గురువారం సాయంత్రానికి 537.20 అడుగుల మేర ఉంది. రిజర్వాయర్‌కు 27528 క్యూసెక్కులు వచ్చి చేరుతుంది.

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 28.9990 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు లీకేజిల ద్వారా వెళుతుంది.

నరసరావుపేట: ఓటర్లుగా నమోదు కాని నిరాశ్రయులు, అత్యంత వెనుకబడిన వర్గాలకు చెందిన అర్హులను గుర్తించి ఓటరు జాబితాలో చేర్చేందుకు ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌లు, నమోదు శిబిరాలు ఏర్పాటు చేయనున్నామని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్ల పేర్కొన్నారు. జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) అక్టోబర్‌ 5న పూర్తికానున్న నేపథ్యంలో గురువారం ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. రాత్రి వసతి గృహాలు, కార్మికుల నివాస ప్రాంతాలు, పేదల కాలనీలు, బస్‌ షెల్టర్లు, ఫుట్‌పాత్‌లు, రైల్వే స్టేషన్లు, ప్రధాన కూడళ్లతో పాటు అత్యంత వెనుకబడిన గిరిజన సమూహాల నివాస ప్రాంతాల్లో ఈ శిబిరాలను నిర్వహించాలన్నారు. నిబంధనల ప్రకారం ఫారం–7, ఫారం–6, 8 ప్రక్రియలను పరిశీలించి, ఈఆర్‌ఓలు సరైన కారణాలతో కూడిన ఉత్తర్వులు జారీ చేశారా అనే అంశాన్ని సైతం తనిఖీ చేస్తారన్నారు. నిరంతర నమోదు ప్రక్రియ సర్‌ సమయంలో ఫారం–6తో పాటు సమర్పించే ప్రత్యేక డిక్లరేషన్‌ ఫారం ఆ సవరణ కాలానికి మాత్రమే వర్తిస్తుందని కలెక్టర్‌ తెలిపారు. సర్‌ పూర్తయిన తర్వాత సాధారణ రోజుల్లో ఓటర్ల నమోదు, సవరణలకు సంబంధించి ఓటర్ల నమోదు నిబంధనల ప్రకారం సాధారణ దరఖాస్తులను స్వీకరిస్తామని స్పష్టం చేశారు. పద్దేనిమిదేళ్లు నిండిన తొలిసారి ఓటర్లతో పాటు ఇప్పటివరకు ఓటరుగా నమోదు కాని అర్హులైన పౌరులను గుర్తించి జాబితాలో చేర్చేందుకు జిల్లావ్యాప్తంగా నిరంతర నమోదు కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. జిల్లా ప్రజలందరూ తమ ఇళ్లకు వచ్చే బీఎల్‌ఓలకు అవసరమైన సహకారం అందించాలని కలెక్టర్‌ కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో పరిశీలించుకోవడంతో పాటు, అవసరమైన సవరణలు, కొత్తగా నమోదు చేసుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు దక్కాలంటే కేంద్రంతో రాజ్యాంగ సవరణ చేయించాలి. తమిళనాడు తరహాలోనే ఏపీ లోనూ రాజ్యాంగ సవరణ ద్వారా రిజర్వేషన్ల పరిమితి పెంచేలా చంద్రబాబు ప్రధాని మోదీపై ఒత్తిడి తేవాలి. ఢిల్లీకి అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని తీసుకెళ్లాలి.

– తాటికొండ నరసింహారావు,

జాతీయ బీసీ బహుజన ఫ్రంట్‌ అధ్యక్షుడు

సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్ర జనాభాలో అధికంగా ఉండే వెనుకబడిన తరగతులు(బీసీ)లపై ప్రభు త్వం మరోమారు తమ కపట వైఖరిని ప్రదర్శించింది. ఎన్నికల సమయంలో మాత్రమే గుర్తుకువచ్చే బీసీ రిజర్వేషన్‌ పెంపుదల అంశంలో కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధి బహిర్గతమైంది. ఆగస్టు 18వ తేదీన బీసీలకు స్థానిక సంస్థల్లో ప్రభుత్వం బీసీలకు ఉన్న రిజర్వేషన్‌ను పెంచి సీట్లు కేటాయిస్తామని గత ఆగస్టులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్భాటంగా ప్రకటించారు. అందుకు అనుగుణంగా రెండు జీఓలను కూడా తీసుకువచ్చారు. అయితే రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం దీనిపై గురువారం కీలకతీర్పు వెల్లడించింది. బీసీలకు గ్రామీణ ప్రాంతాల్లో 34 శాతం, పట్టణ ప్రాంతాల్లో స్థానిక సంస్థలకు 33.33 శాతం రిజర్వేషన్‌లను కల్పిస్తామని తీసుకువచ్చిన జీఓలను కొట్టివేసింది.

సమాచారం సేకరించటంలో విఫలం..

రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్‌ పెంపుదల, ఖరారుకు సీనియర్‌ రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి రాజీవ్‌రంజన్‌ ఆధ్వర్యంలో బీసీ డెడికేషన్‌ కమిషన్‌ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్‌ రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బీసీల వెనుకబాటు తనంపై అనుభవపూర్వక విచారణ, వారి రిజర్వేషన్‌ పెంచే ప్రక్రియ చేయటమే కమిటీ ఉద్దేశం. ఈ కమిటీ సెప్టెంబర్‌ 30 వరకు పనిచేసింది. అయితే కమిటీ పూర్తిస్థాయిలో నివేదికలు ఇవ్వలేదని, సరైన సమాచారం సేకరించటంలో విఫలమైందని, క్షేత్ర స్థాయి పరిశీలన చేయకుండానే ప్రభుత్వం సమర్పించిన నివేదికలను మాత్రమే పరిగణలోకి తీసుకుని నివేదికను సిద్ధం చేసిందనే విమర్శలు ఉన్నాయి.

బీసీలకు బాబు వెన్నుపోటు

టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఉమ్మడి గుంటూరు జిల్లాలో రెండు రాజ్యసభ సీట్లు, ఒక ఎమ్మెల్సీ స్థానం సొంత సామాజిక వర్గ నేతలకే ఇచ్చుకున్న చంద్రబాబు ఏ ఒక్క స్థానంలోనూ బీసీలకు అవకాశం ఇవ్వలేదు. గుంటూరు మిర్చి యార్డు చైర్మన్‌ నుంచి, జీడీసీసీ బ్యాంక్‌ చైర్మన్‌, మేయర్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌, వివిధ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు ఇలా ఇచ్చిన నామినేటెడ్‌ పోస్టులన్నీ సొంత సామాజిక వర్గానికే కేటాయించారు తప్ప.. ఒక్క పోస్టు కూడా బీసీలకు ఇవ్వలేదు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌ అంటూ డ్రామా ఆడుతున్న చంద్రబాబు ఉమ్మడి జిల్లాలో 2 శాతం కూడా ఇవ్వకపోవడం కొసమెరుపు.

రిజర్వేషన్ల పేరుతో ప్రభుత్వం బీసీలను మోసగించే ప్రయత్నం చేసింది. 105, 1065 జీఓలను కోర్టు కొట్టి వేయడంతో ప్రభుత్వ కుటిల నైజం బట్టబయలైంది. న్యాయపరమైన అంశాలపై స్పష్టత లేకుండా మాయమాటలతో మభ్యపెట్టారు.

– గుంటూరు గోవింద్‌, బీసీ సంక్షేమ సంఘం

కన్వీనర్‌, సత్తెనపల్లి, పల్నాడు

గత వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ హయాంలో జిల్లాకు చెందిన బీసీ నాయకుడు మోపిదేవి వెంకటరమణ రేపల్లె నుంచి పోటీ చేసి ఓటమి పాలైనప్పటికీ, తొలుత ఎమ్మెల్సీ ఇచ్చి, మంత్రిగా అవకాశం కల్పించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆతరువాత ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చి బీసీలకు పెద్ద పీట వేశారు. జిల్లాకు చెందిన బీసీ నేత విడదల రజినికి మంత్రివర్గంలో స్థానం కల్పించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా గుంటూరు మిర్చి యార్డు చైర్మన్‌గా, గుంటూరు వెస్ట్‌ నుంచి ఓటమి పాలైన బీసీ నేత చంద్రగిరి ఏసురత్నంకు ఇచ్చి, అనంతరం ఆయనకు ఎమ్మెల్సీగా సైతం అవకాశం కల్పించారు. ఆయన్ను మార్చిన తరువాత కూడా మరో బీసీ నేత నిమ్మకాయల రాజనారాయణకు యార్డు చైర్మన్‌గా అవకాశం కల్పించారు. మంగళగిరికి చెందిన బీసీ నేత మురుగుడు హనుమంతరావుకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. జిల్లా కో–ఆపరేటీవ్‌ మార్కెటింగ్‌ సొసైటీ చైర్మన్‌గా బీసీ మహిళ యార్లగడ్డ భాగ్యలక్ష్మికి అవకాశం కల్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement