చేపల పెంపకంతో ఉపాధి కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

చేపల పెంపకంతో ఉపాధి కల్పించాలి

Sep 25 2026 2:11 AM | Updated on Sep 25 2026 2:11 AM

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా

నరసరావుపేట: జిల్లాలోని నిరుద్యోగ యువత, మత్స్యకారులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపల పెంపకాన్ని ప్రోత్సహించడంపై అవగాహన కల్పించి, ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా తెలిపారు. కలక్టరేట్‌లో ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వై) జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ముందుగా గతేడాది కేటాయించిన బడ్జెట్‌లోని రూ.50 లక్షలకు సంబంధించి రెండు బయోఫ్లాక్‌ పాండ్స్‌, మోటార్‌ సైకిల్‌ విత్‌ ఐస్‌బాక్స్‌ల పంపిణీకి లబ్ధిదారులను ఎంపిక చేసి ప్రతిపాదనలు అందించాలని ఆదేశించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఆర్థిక లక్ష్యాలు గడువులోగా వంద శాతం పూర్తిచేయాలని తెలిపారు. అన్ని నియోజకవర్గాలకు చెందిన లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. కోల్డ్‌ స్టోరేజ్‌లు, ఐస్‌ ప్లాంట్లు, ఆక్సిజన్‌ సిలిండర్లు, సింటెక్స్‌ బాక్సులు, ఫిష్‌ రిటైల్‌ మార్కెట్‌ నిర్మాణం, చేపల రవాణాకు మూడు చక్రాలతో కూడిన ప్రత్యేక వాహనాలు, జలాశయాల్లో చేప పిల్లలను నిల్వ చేయడం, ఫిష్‌ కియోస్క్‌ల ఏర్పాటు అంశాలపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. జిల్లా మత్స్య శాఖాధికారి పి.ప్రసాద్‌ , జిల్లా వ్యవసాయ అధికారి ఐ.జగ్గారావు, పల్నాడు లీడ్‌ డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌ కె. రాంప్రసాద్‌, ఎన్‌ఎస్‌పీ ఈఈ శ్రీనివాసరావు, డీఆర్‌డీఏ పీడీ ఝాన్సీరాణి, కృషి విజ్ఞాన కేంద్రం అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement