భారీ వర్షాలు.. పొంగుతున్న వాగులు | - | Sakshi
Sakshi News home page

భారీ వర్షాలు.. పొంగుతున్న వాగులు

Sep 25 2026 2:11 AM | Updated on Sep 25 2026 2:11 AM

అమరావతి: గత రెండు రోజులగా రాష్ట్ర వ్యాప్తంగా తుఫాన్‌ కారణంగా కురిసిన భారీ వర్షానికి మండలంలోని వాగులు పొంగిపొర్లటంతో గురువారం అమరావతి, క్రోసూరు మార్గంలో రాకపోకలు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వర్షపు నీటితో మండల పరిధిలోని ముత్తాయపాలెం వద్ద క్రోసూరు–అమరావతి రహదారిపై సుమారు మూడు అడుగుల ఎత్తులో వర్షపు నీరు ప్రవహించింది. వాగు ఉధృతి తగ్గుముఖం పట్టాక రాకపోకలను పునరుద్ధరించారు. మండలంలోని కొండవీటి వాగు, మేళ్లవాగు, పెదమద్దూరు వద్ద వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వాగుల పరివాహక ప్రాంతాలలోని పొలాలు నీటమునిగాయి. కొన్ని ప్రాంతాలలో పత్తి చేలలోకి నీరు చేరింది.

పత్తి మొక్కలకు ప్రాణం పోసిన వర్షం

ఈ ఏడాది వర్షాలు తక్కువగా ఉండటంతో ఎండవేడిమికి తట్టుకోలేక బెట్ట కొచ్చిన పత్తి మొక్కలకు ఈ వర్షం ప్రాణం పోసింది. ఈ వర్షం పత్తి పంటకు, మిరప నారుకు ఉపయోగపడుతుందని రైతులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. పెదకూపాడులోని పేరమ్మవాగు, నీటి కుంట, లో లెవల్‌ చప్టాలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో అమరావతి–సత్తెనపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల కారణంగా యడ్లపాడు మండలంలోని కొండవీడు కోటకు వచ్చే సందర్శకుల రాకను నిలిపివేశారు. పర్యాటకుల భద్రత దృష్ట్యా సందర్శన రద్దు చేసినట్లు ఫారెస్ట్‌ రేంజర్‌ డీవీ రమణ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement