జిల్లాలో పంచాయతీలు, ఓటర్ల వివరాలు
జిల్లాలో మహిళా ఓటర్లే కీలకం
పురుషుల కన్నా
మహిళా ఓటర్లే అధికం
రిజర్వేషన్‌లోనూ మెజార్టీ సర్పంచ్, వార్డు స్థానాలు వారికే
అభ్యర్థుల ఎంపిక, పోలింగ్‌లో అతివలపై పార్టీల దృష్టి
అందరి చూపు అటే..!
సత్తెనపల్లి: జిల్లాలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయాలు మహిళా ఓటర్ల చుట్టూ తిరుగుతున్నాయి. మొత్తం 530 గ్రామ పంచాయతీలు ఉంటే సీఆర్‌డీఏ కిందకు వెళ్లిన 18 పంచాయతీలు మినహాయించి 512 పంచాయతీ సర్పంచ్‌లు, 5,286 గ్రామ వార్డు సభ్యులకు మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక పంచాయతీల పరిధిలోని మొత్తం గ్రామీణ ఓటర్లు 12,36,776 మంది ఉండగా వీరిలో పురుషులు 6,08,095 మంది, మహిళలు 6,28,583 మంది, ఇతరులు 98 మంది ఉన్నారు. పురుషులకంటే మహిళలు 20,488 మంది ఎక్కువగా ఉన్నారు. ఈ నేపధ్యంలో రాజకీయ పార్టీల నాయకులు తమ వ్యూహలకు పదును పెడుతున్నారు.
మహిళలే కీలకం
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించే శక్తిగా మహిళలు నిలవనున్నారు. మొత్తం ఓటర్లలో పురుషుల కన్నా 20,488 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. దీంతో అభ్యర్థులు అతివల ఓట్లు రాబట్టుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.
అన్నింటా పై చేయి
జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్‌ల్లో గల ఏడు నియోజకవర్గాల్లోని 28 మండలాలకు గాను 24 మండలాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. బొల్లాపల్లి, నూజండ్ల, మాచర్ల, వెల్దుర్తి మండలాల్లో మాత్రమే మహిళా ఓటర్ల కన్నా పురుష ఓటర్లు కాస్తంత ఎక్కువగా ఉన్నారు. నరసరావుపేట రెవెన్యూ డివిజన్‌లో 7,577 మంది, సత్తెనపల్లి రెవెన్యూ డివిజన్‌లో 7,407 మంది, గురజాల రెవెన్యూ డివిజన్‌లో 5,504 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నట్లు గ్రామీణ ఓటర్ జాబితా ద్వారా తేలింది. జిల్లా అంతటా పురుషులు, మహిళా ఓటర్ల మధ్య తేడా భారీగా ఉంది.
అమరేశ్వరాలయంలో భక్తుల సందడి..
అమరావతి: ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రమైన అమరావతిలో వేంచేసియున్న శ్రీబాలచాముండికా సమేత అమరేశ్వ రస్వామి ఆలయంలో మంగళవారం కార్తికమాసం ప్రారంభం సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం వేకువజామునుంచే అమరేశ్వరుని దర్శించుకున్నారు. భక్తులు పవిత్ర కృష్ణానదిలో కార్తిక స్నానాలు చేసి ఆలయంలో కార్తిక దీపాలను వెలిగించి కార్తిక దామోదరునికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమరేశ్వరునికి అభిషేకాలు, బాలచాముండేశ్వరీ అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారికి, అమ్మవారికి ప్రత్యేక పంచహారతులు నిర్వహించారు. అనంతరం అలయ ధ్వజస్తంభం వద్ద ఆకాశ కుండలలో దీపాలు వెలిగించి దీపాలున్న కుండలను ధ్వజస్తంభం పైకి ఆవిష్కరించారు.
రెవెన్యూ డివిజన్ పంచాయతీలు పురుషులు మహిళలు ఇతరులు మొత్తం ఓటర్లు
నరసరావుపేట 228 2,38,491 2,46,068 53 4,84,612
సత్తెనపల్లి 150 1,84,142 1,91,549 19 3,75,710
గురజాల 134 1,85,462 1,90,966 26 3,76,454
మొత్తం 512 6,08,095 6,28,583 98 12,36,776
గ్రామ పంచాయతీ ఎన్నికలు మహిళలే ప్రాధాన్యతగా జరగనున్నాయి. ఈ నేపధ్యంలో రాజకీయ పార్టీల నాయకులు, మహిళలకు రిజర్వ్ అయిన సర్పంచ్ స్థానాలు, వార్డు సభ్యుల స్థానాలను లెక్కించే పనిలో నిమగ్నమయ్యారు. రిజర్వ్‌డ్ స్థానాల్లో తాము మద్దతు ఇచ్చే మహిళా అభ్యర్థులను పోటీకి దింపాలని వ్యూహరచన చేస్తున్నారు. అన్ని పార్టీలు ఇలాగే ఆలోచిస్తూ ఉండడంతో రాజకీయాల పై ఆసక్తి ఉన్న మహిళలకు మంచి అవకాశాలు దక్కనున్నాయి. పార్టీల్లో చురుకై న మహిళా నాయకులతో పోటీ చేయించడంపై నాయకులు, మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు యత్నాలు ప్రారంభించారు.


