గుంటూరు మెడికల్: గోవాలో వరల్డ్ కెటిల్‌బెల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 23 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించిన ఆసియా స్థాయి కెటిల్‌బెల్ చాంపియన్‌షిప్‌లో జావేద్ అహ్మద్ అద్భుత ప్రతిభ కనబరిచి రజత పతకాన్ని సాధించాడు. వన్ ఆర్మ్ లాంగ్ సైకిల్ 10 నిమిషాల విభాగంలో 24 కిలోల కెటిల్‌బెల్‌తో పోటీపడి ద్వితీయ స్థానాన్ని కై వసం చేసుకున్నాడు. అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని రజత పతకం సాధించడం అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ గిరేవాయ్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, లలిత గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ పి.వి.రాఘవ శర్మ మంగళవారం క్రీడాకారుడు జావేద్ అహ్మద్‌ను ప్రత్యేకంగా అభినందించారు.


