ముందుకు రావడం లేదు
మిర్చి నారు చేతికొచ్చినా ప్రస్తుత పరిస్థితులలో సాగుకు రైతులు ముందుకు రావడం లేదు. అడ్వాన్స్‌లు ఇచ్చి నారు పోయించిన వారు సైతం వెనుకంజ వేస్తున్నారు. ఎవరైనా వస్తే తమ నారు ఇచ్చేయమని చేతులు ఎత్తేస్తున్నారు. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టిన నర్సరీ నిర్వాహకులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదముంది. ఈ రెండు వారాల్లో మంచి వర్షాలు నమోదై, కాలువలకు నీరు వస్తే పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
సాగు కష్టంగా ఉంది
నాకు 12 ఎకరాలు ఉండగా, గతేడాది అందులో 8 ఎకరాల్లో మిర్చి సాగు చేశాను. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో కనీసం 4 ఎకరాల్లో అయినా సాగు చేద్దామని అకుంటున్నాను. అయితే ఇప్పటివరకు వర్షాలు కురవకపోవడంతో సాగు కష్టంగా మారుతోంది. బోరు బావుల ద్వారా సాగు చేసిన మొక్కలు సైతం తీవ్ర వేడికి వాడిపోతున్నాయి. ఇదే పరిస్థితి మరో 15 రోజులు ఉంటే జిల్లాలో మిర్చి సాగు ప్రమాదంలో పడనుంది.
దిక్కుతోచని స్థితిలో మిర్చి రైతులు
పెంచిన మిరప మొక్కలు వాడిపోతున్న దీనస్థితి
నారు వేరేవారికి విక్రయించుకోవాలని నర్సరీలకు చెబుతున్న రైతులు
నష్టాలతో దిక్కుతోచని స్థితిలో నర్సరీ నిర్వాహకులు
జిల్లాలో 1.25 లక్షల ఎకరాలకు 17 వేల ఎకరాలే ఇప్పటివరకు సాగు
పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్‌లో సాధారణ మిర్చి పంట సాగు 1.25 లక్షల ఎకరాల్లో ఉంటుందని
ఉద్యాన శాఖ అంచనా వేసింది. ఇప్పటివరకు జిల్లాలో కేవలం 17 వేల ఎకరాల్లో మాత్రమే సాగైంది. అది కూడా బోర్ల కింద నీటి సదుపాయం ఉన్న రైతులు సాగు చేశారు. అయితే ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఆ పంటలు సైతం వాడిపోతున్నాయి. నీటి తడులు పెట్టినా మొక్కలు పెరుగుదల లేదని రైతులు వాపోతున్నారు. సుమారు మరో లక్ష ఎకరాలు ఈ ఖరీఫ్‌లో సాగవ్వాల్సి ఉంది. ఇదే పరిస్థితి మరో రెండు వారాలు కొనసాగితే సాగు కష్టమనే భావన నెలకొంది. సాధారణంగా సెప్టెంబర్ 15వ తేదీ వరకు మిర్చి సాగుకు అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు సాధారణ వర్షపాతంలో కనీసం సగం కూడా కురవకపోవడం, నాగార్జునసాగర్ కుడి కాలువకు నీటిని విడుదల చేయకపోవడంతో సాగుపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. ప్రభుత్వం వెంటనే సాగర్ కుడి కాలువ ద్వారా ఆరుతడి పంటలకు నీరు విడుదల చేస్తే పరిస్థితి కొంత నయంగా ఉంటుంది.
ఖరీఫ్ ప్రారంభమైనా సాగునీరు లేక రైతులకు కష్టాలు
– బద్దూరి బ్రహ్మానందరెడ్డి, నర్సరీ నిర్వాహకుడు, ఆత్మకూరు గ్రామం
పల్నాడు రైతులు ఎర్రబంగారంగా పిలుచుకునే మిర్చి పంట సాగు ఈ ఏడాది ప్రమాదంలో పడుతోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండున్నర నెలలు దాటినా ఇప్పటివరకు సరైన వర్షపాతం నమోదు కాలేదు. మరోవైపు సాగర్ కుడి కాలువకు నీటి విడుదలపై ప్రభుత్వం రైతులకు భరోసా ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో నారు పోసిన రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇప్పటికే నారు పోసి సుమారు 60 రోజులు కావస్తోంది. సాధారణంగా 45–50 రోజుల మధ్య మిర్చి నారు సాగుకు సరైన సమయం. సాగునీటి కోసం రైతులు ఎదురుచూడటంతో ఇప్పటికే నారు ముదిరిపోయింది. దీంతో నర్సరీల్లోనే నారు ఉండిపోయింది.
– లక్ష్మారెడ్డి,
మిర్చి రైతు, మండాది, వెల్దుర్తి మండలం


