చిలకలూరిపేటటౌన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్స్ లీగల్ అడ్వైజర్‌గా పట్టణానికి చెందిన న్యాయవాది పాలికి శ్రీనుబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయవాడలోని రాష్ట్ర కార్యాలయంలో శనివారం జరిగిన కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్స్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ ఉన్నం జ్ఞాన సుందరి చేతుల మీదుగా ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా లీగల్ అడ్వైజర్ పాలికి శ్రీనుబాబు మాట్లాడుతూ... రాష్ట్రంలో ప్రజలకు ఎక్కడ ఏ రకమైన అన్యాయం లేదా సమస్య ఎదురైనా, తన వంతుగా బాధితుల తరఫున నిలబడి చట్టపరంగా న్యాయపోరాటం చేస్తానని స్పష్టం చేశారు. మానవ హక్కుల పరిరక్షణకు, సామాన్యులకు న్యాయం అందించడానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన శ్రీనుబాబును పలువురు న్యాయవాదులు అభినందించారు.


