న్యూస్‌రీల్
ప్రతి నెలా పది శాంపిళ్లు
యథేచ్ఛగా మార్కెట్‌లో నకిలీ ఔషధాలు విచ్చలవిడిగా మత్తు మందుల విక్రయాలు నకిలీ బ్రాండ్ల తయారీకి అడ్డాగా నరసరావుపేట ప్రజల ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం దాడులు మరిచిన డ్రగ్స్ కంట్రోల్ అధికారులు ధనార్జనే ధ్యేయంగా రెచ్చిపోతున్న అక్రమార్కులపై చర్యలు శూన్యం
ఉపాధ్యాయులపై అదనపు భారం...
సోమవారం శ్రీ 17 శ్రీ ఆగస్టు శ్రీ 2026
నరసరావుపేటను మెడికల్ మాఫియా కమ్మేసింది. తలనొప్పిగా ఉంటేనో, జ్వరం వస్తేనో మెడికల్ దుకాణంలో మందుల చీటీ లేకుండా మాత్రలు తెచ్చుకుంటే.. అవే రోగాలను తెచ్చే విషగుళికలుగా మారుతున్నాయి. ఔషధాల తయారీ మాటున సాగుతున్న అక్రమాల దందాకు ప్రజల ప్రాణాలు గాలిలో దీపాలవుతున్నాయి. ప్రతి నెలా మందుల షాపులపై దాడులు చేయాల్సిన అధికార యంత్రాంగం నిద్ర మత్తులో జోగుతుంటే.. నకిలీ ఔషధాలు మార్కెట్‌ను నింపేస్తున్నాయి. రెండేళ్లుగా పాలకులూ పట్టించుకోవడం లేదు.
పేట్రేగిపోతున్న
ప్రాంతీయ గ్రంథాలయం పునర్నిర్మాణం
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణం సీతానగరంలోని విజయకీలాద్రి దివ్య క్షేత్రంపై ఆదివారం బదరి నారాయణ తిరునక్షత్ర మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌స్వామి మంగళాశాసనాలతో బదరి నారాయణ తిరునక్షత్ర మహోత్సవం ఘనంగా జరిగిందని తెలిపారు. కార్యక్రమాల్లో భాగంగా ఉదయం అష్టాక్షరి మంత్ర జపం, 9 గంటలకు వేణుగోపాల స్వామికి అభిషేకం, అర్చన కార్యక్రమాలు నిర్వహించామని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారన్నారు.
గుంటూరు ఎడ్యుకేషన్: కృష్ణా–గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థిగా మల్నేని హనుమంతరావును పోటీలో నిలుపుతున్నట్లు పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి, మాజీ ఎమ్మెల్సీలు వి.బాలసుబ్రమణ్యం, కేఎస్ లక్ష్మణరావు, ఐ.వెంకటేశ్వరరావులు ఆదివారం ఓ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. పీడీఎఫ్ అభ్యర్థిగా ఎం.హనుమంతరావు అభ్యర్థిత్వానికి యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ సంపూర్ణంగా మద్దతునిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్.వెంకటేశ్వర్లు, కేఎస్‌ఎస్ ప్రసాద్ తెలిపారు. పల్నాడు జిల్లా యడ్లపాడు మండలానికి చెందిన హనుమంతరావు 1996 నుంచి సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా వృత్తిని ప్రారంభించి, స్కూల్ అసిస్టెంట్, ఇన్‌చార్జి హెచ్‌ఎంగా 30 ఏళ్ల సర్వీసును పూర్తి చేసుకుని, ఇటీవల ఉద్యోగ విరమణ చేశారు. 30 ఏళ్లలో యూటీఎఫ్ మండల ప్రధాన కార్యదర్శిగా, జిల్లా కోశాధికారిగా, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర ప్రచురణ విభాగ చైర్మన్‌గా బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించారని గుర్తుచేశారు. ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడిగా సీపీఎస్ రద్దు పోరాటాలతో పాటు విద్యారంగ సంస్కరణలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో చురుగ్గా పాల్గొన్నారు.
గుంటూరు వెస్ట్(క్రీడలు): లాన్ టెన్నిస్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో జిల్లా స్థాయి అండర్ 10, 12,14,16 బాలబాలికలతోపాటు పురుషులు, మహిళల విభాగాల్లో పోటీలు నిర్వహించారు. జిల్లా సంఘం చైర్మన్ నాయబ్ కమల్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సుమారు 200 మంది పోటీల్లో పాల్గొన్నారన్నారు. ఈ ఎంపికల నుంచి ప్రతి విభాగంలో ఐదుగురిని ఎంపిక చేసి రాష్ట్ర సంఘం నిర్వహించే ర్యాంకింగ్ పోటీలకు పంపుతామని తెలిపారు. తర్వాత విజేతలకు బహుమతులను నాయబ్ కమల్, అధ్యక్షుడు ఎన్.సాంబశివ రావు అందజేశారు. కార్యక్రమంలో టెన్నిస్ శిక్షకులు జీవీఎస్ ప్రసాద్, అహ్మద్, కుమార్, నరసింహారావు, ఆనంద్ కుమార్, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఇంద్ర కీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా ఆదివారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి కుటుంబ సమేతంగా విచ్చేసిన డీజీపీకి ఈఓ శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ సాదరంగా స్వాగతం పలికారు. అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలకగా, హరీష్‌కుమార్‌గుప్తా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. ఆలయ ఈఓ, చైర్మన్‌లు ఆయనకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, పట్టు వస్త్రాలను అందజేశారు.
నరసరావుపేట టౌన్: పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో మెడికల్ మాఫియా రోజురోజుకూ విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఔషధం అంటే ప్రాణాలను కాపాడాల్సింది. కానీ అదే ఔషధం నకిలీగా మారితే ప్రాణాలను హరించే విషంగా మారుతోంది. ఫిజీషియన్ శాంపిళ్ల విక్రయాలు, మత్తు మందుల అక్రమ రవాణా, బ్రాండెడ్ కంపెనీల పేర్లతో నకిలీ ఔషధాల తయారీ, కాలం చెల్లిన మందుల విక్రయాలు కొనసాగుతున్నాయి. వీటిని అరికట్టాల్సిన అధికారులు మాత్రం దాడులు, తనిఖీలు మరిచిపోయారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా ప్రజల ఆరోగ్యం, ప్రాణాలు అక్రమ వ్యాపారుల చేతుల్లో బందీగా మారాయి. రాష్ట్రంలోనే నరసరావుపేట పట్టణం ఔషధాల వ్యాపారానికి ప్రధాన కేంద్రంగా పేరొందింది. అదే పేరును కొందరు అక్రమ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని మెడికల్ షాపుల్లో ఉచితంగా రోగులకు ఇవ్వాల్సిన ఫిజీషియన్ శాంపిళ్లు బహిరంగంగా విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు వైద్యుల సూచనతో మాత్రమే ఇవ్వాల్సిన కొన్ని మత్తు మందులు కూడా నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్నారు. ఈ మందులు యువత చేతుల్లోకి చేరి దుర్వినియోగానికి గురవుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.
తయారీకి అడ్డా..
రాష్ట్రంలోనే కాకుండా ఇతర ప్రాంతాలకు కూడా టాబ్లెట్లను సరఫరా చేసే డీలర్లు నరసరావుపేటలో అధిక సంఖ్యలో ఉన్నారని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. అసలు బ్రాండెడ్ కంపెనీల ప్యాకింగ్, రంగు, ఆకారాన్ని అచ్చుగుద్దినట్లు అనుకరిస్తూ నకిలీ ఔషధాలు తయారు చేసి మార్కెట్‌లోకి పంపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నకిలీ మందులు ఇతర జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాలకు కూడా పార్శిళ్ల ద్వారా చేరుతున్నాయనే సమాచారం ఉంది. తక్కువ పెట్టుబడితో భారీ లాభాలు వస్తుండటంతో ఈ అక్రమ వ్యాపారం విస్తరిస్తోందని చెబుతున్నారు.
‘ట్రెమడాల్’ ఏమైంది..?
రెండేళ్ల క్రితం నరసరావుపేటలోని ఒక ఫార్మా కంపెనీలో అధికారుల దాడుల్లో ట్రెమడాల్ మాత్రల తయారీ వెలుగులోకి వచ్చింది. విద్రోహ శక్తులకు అక్రమ మార్గంలో రవాణా అవుతుండగా మాత్రలు పట్టుబడ్డాయి. మూలాలు నరసరావుపేటలో గుర్తించడంతో అప్పట్లో అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. ఆ సమయంలో తనిఖీకి వచ్చిన అధికారులు పలు ప్రముఖ బ్రాండ్ల పేర్లతో నకిలీ ఔషధాలు తయారు చేస్తున్నట్లు కూడా గుర్తించారు. ఆ ఘటన తర్వాత కఠిన చర్యలు కొనసాగాల్సి ఉండగా, ఆ దిశగా తీసుకున్న చర్యలేమీ కనిపించలేదనే విమర్శలు ఉన్నాయి. దీంతో అక్రమ వ్యాపారులు మళ్లీ రెచ్చిపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తనిఖీలు శూన్యం
జిల్లాలో సుమారు 800కు పైగా మెడికల్ షాపులు ఉండగా, డ్రగ్స్ కంట్రోల్ శాఖ అధికారులు ప్రతి నెలా పెద్ద ఎత్తున శాంపిళ్లు సేకరించి ప్రయోగశాలలకు పంపాల్సి ఉంది. నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్నారు. నకిలీ లేదా నాణ్యతలేని మందులు కలిగి ఉన్నట్టు తేలితే సంబంధిత నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి లైసెన్సులు రద్దు చేసే అధికారం ఆ శాఖకు ఉంది. అయితే గత రెండేళ్లుగా పెద్ద ఎత్తున తనిఖీలు, దాడులు జరిగినట్లు కనిపించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు రాలేదన్న సమాధానం మాత్రమే ఆ శాఖ అధికారులు చెప్పుకొస్తున్నారు. దీంతో నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారికి భయం లేకుండా పోయింది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన వ్యవస్థ అక్రమ వ్యాపారులపై ఉక్కుపాదం మోపాల్సిన సమయంలో అధికారులు ఎందుకు మౌనం పాటిస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. క్రమం తప్పకుండా తనిఖీలు, శాంపిళ్ల సేకరణ, నకిలీ మందులపై ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టకపోతే మెడికల్ మాఫియా మరింత బలపడే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కఠిన చర్యలు తీసుకోవాలి...
జిల్లాలోని అన్ని ఔషధ దుకాణాలు, గోదాములు, ఫార్మా యూనిట్లపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. ఫిజీషియన్ శాంపిళ్లు విక్రయిస్తున్న వారితో పాటు మత్తు మందులను అక్రమంగా అమ్ముతున్న వారిపై, నకిలీ ఔషధాలు తయారు చేసి సరఫరా చేస్తున్న ముఠాలపై కఠిన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
విద్యాశాఖ ప్రతి ఏటా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నిర్వహించే త్రైమాసిక, అర్ధ, వార్షిక పరీక్షలను ఎఫ్‌ఏ–1, 2, 3, 4, ఎస్‌ఏ–1, 2లుగా నిర్వహిస్తుంది. ఈ పరీక్షలను మూల్యాంకన పుస్తకాల్లో రాసేందుకు వీలుగా 1, 2 తరగతులకు మూడు పుస్తకాలు, 3, 4, 5 తరగతులకు నాలుగు పుస్తకాలు, 6, 7 తరగతులకు ఆరు పుస్తకాలు, 8, 9, 10 తరగతులకు ఏడు పుస్తకాల చొప్పున అందజేస్తున్నారు. ఏడాదిలో జరిగే అన్ని పరీక్షల వివరాలను ఈ మూల్యాంకన పుస్తకంలో నమోదు చేసేందుకు ఏడాదంతా ఈ పుస్తకాన్ని ఉపాధ్యాయులు భద్రంగా ఉంచాలి. అయితే గతంలో పరీక్షలను విద్యార్థులు తెల్లకాగితాలపై రాస్తే, ఉపాధ్యాయులు వాటిని ఇంటికి తీసుకెళ్లి మూల్యాంకనం చేసేవారు. తర్వాత మార్కుల నమోదు ప్రక్రియ పూర్తయ్యేది. ప్రస్తుతం బుక్‌లెట్‌లో రాస్తుండడంతో వీటిని ఇంటికి తీసుకెళ్లలేని పరిస్థితి. తప్పనిసరిగా పాఠశాలల్లోనే దిద్దాల్సి ఉంటుంది. దీంతో తరగతి గదిలో సమయం అంతా వృథా అవుతుండడంతో సిలబస్ పూర్తి చేయలేని పరిస్థితులు నెలకొంటాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఒకే బుక్‌లెట్‌లో పరీక్షలు రాయాల్సి రావడంతో త్రైమాసిక పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలను అర్ధ సంవత్సర పరీక్షల్లో కూడా ఇస్తే, విద్యార్థులు గతంలో తాము రాసిన సమాధానాలనే తిరిగి చూసి రాసుకునే అవకాశం ఉంటుంది. విద్యాశాఖ అధికారులు మాత్రం మూల్యాంకన పుస్తకంలో జవాబులు రాయడం వల్ల విద్యార్థులకు ఎంతో ఉపయోగమని చెబుతున్నారు. ఒక విద్యార్థికి సంబంధించి అన్ని సబ్జెక్టుల మార్కులతో పాటు, విద్యార్థి వివరాలన్నీ మూల్యాంకన పుస్తకంలో నమోదు చేసేలా ఉన్నత విద్యాశాఖ అసెస్‌మెంట్ బుక్‌లెట్‌ను డిజైన్ చేసినట్లు పేర్కొంటున్నారు. విద్యార్థుల సౌలభ్యం కోసం ఉపాధ్యాయులు కొంత కష్టపడాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
గుంటూరు ఎడ్యుకేషన్: ఏసీ కళాశాల ఎదుట ఉన్న ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయాన్ని పునర్నిర్మించేందుకు ఆదివారం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్(సీసీఎల్) చైర్మన్ చల్లా రాజేంద్రప్రసాద్ అందిస్తున్న రూ.20 కోట్ల ఆర్థిక సహకారంతో నూతనంగా నిర్మించనున్న జీ ప్లస్‌టూ గ్రంథాలయ భవన నిర్మాణానికి సంబంధించిన వివరాలను ఆదివారం కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ తెలిపారు. 1915లో బ్రిటీషు పాలనలో నిర్మించిన ప్రాంతీయ గ్రంథాలయం 110 ఏళ్లకు పైబడి ఇదే భవనంలో కొనసాగుతోందని అన్నారు. ఈ మేరకు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గళ్లా మాధవి, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
నిబంధనల ప్రకారం ప్రతి ఔషధ దుకాణాన్ని తనిఖీ చేస్తాం. ప్రతినెలా 5 ప్రభుత్వ, మరో 5 ప్రైవేట్ మందుల దుకాణాలను తనిఖీ నిర్వహించి శాంపిళ్లను సేకరిస్తున్నాం. ల్యాబ్ నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం. ఫిజిషియన్ శాంపిళ్లు, నకిలీ మందుల విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం.
– షేక్ పర్వీన్ సుల్తానా,
డ్రగ్ ఇన్‌స్పెక్టర్, నరసరావుపేట


