సత్తెనపల్లి: ఆంధ్రప్రదేశ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 16న ఉదయం 9 గంటలకు సత్తెనపల్లి సుగాలీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా సీనియర్ పురుషుల, సీ్త్రల ఫుట్‌బాల్ జట్టు సెలక్షన్ ట్రయల్స్ జరగనున్నాయి. ఈ మేరకు పల్నాడు జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.సుబ్రహ్మణ్యేశ్వర రావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన క్రీడాకారులు వారి ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, నాలుగు జిరాక్స్ కాపీలు, ఒరిజినల్స్, నాలుగు పాస్‌పోర్ట్ ఫొటోలు తీసుకురావాలన్నారు. ఎంపికై న క్రీడాకారులకు క్యాంపు నిర్వహిస్తామని చెప్పారు. తప్పని సరిగా క్యాంపులో పాల్గొనాలని పేర్కొన్నారు. వివరాలకు 97010 52588 నంబర్‌లో సంప్రదించాలన్నారు.
చిలకలూరిపేట టౌన్: పట్టణంలో మరో భారీ చోరీ వెలుగు చూసింది. తాళం వేసి ఉన్న ఇంట్లోకి చొరబడిన దుండగులు కేజీ వెండి ఆభరణాలు, మూడు సవర్ల బంగారు నగలతోపాటు రూ.లక్ష నగదు చోరీ చేశారు. వారం రోజుల క్రితం ఆర్టీసీ కండక్టర్ శారద దంపతులు వేరే ఊరిలోని తమ కుమారుడి వద్దకు వెళ్లారు. గురువారం విషయం వెలుగుచూడటంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్బన్ పోలీసులు వెంటనే క్లూస్ టీమ్‌తో వచ్చి ఘటనా స్థలిని పరిశీలించారు వేలిముద్రలు, ఇతర కీలక ఆధారాలను సేకరించారు. ఇటీవల కాలంలో పట్టణంలో వరుస దొంగతనాలు జరుగుతుండటంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించి, అన్ని కోణాల్లో దర్యాప్తును వేగవంతం చేశారు.


