సమగ్ర శిక్ష ఏపీఓ శ్యాంప్రసాద్
నరసరావుపేట ఈస్ట్: అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేయటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ శ్యాంప్రసాద్ తెలిపారు. మున్సిపల్ బాలికోన్నత పాఠశాలలో మూడు రోజుల పాటు అంగన్‌వాడీ ఉపాధ్యాయులకు నిర్వహించనున్న జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. అంగన్‌వాడీ కేంద్రాలలో చేరిన చిన్నారులను తమ సొంత బిడ్డల్లా భావించి వారికి అక్షర జ్ఞానం అందివ్వాలని కోరారు. అంగన్‌వాడీ కేంద్రం పునాదిగా చిన్నారులు తమ విద్యను ఉన్నతంగా కొనసాగించాలని ఆకాంక్షించారు. పాఠశాలలో చేరిన అండన్‌వాడీ చిన్నారులు తమ పాఠశాల విద్యను ఎటువంటి ఇబ్బందులకు లోనుకాకుండా పూర్తి చేసుకునేలా వారికి తగిన శిక్షణ ఇవ్వాలని కోరారు. సమగ్ర శిక్ష ఏఎంఓ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ జ్ఞానజ్యోతి శిక్షణ ఉపాధ్యాయులకు ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. కార్యక్రమంలో ఐసీడిఎస్ పీడీ నాగమల్లేశ్వరి, ఎస్‌ఆర్‌పీ, డీఆర్పీ, అంగన్‌వాడీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


