న్యూస్‌రీల్
రాజీనామా బెదిరింపులు
గురజాల, మాచర్ల టీడీపీ ఎమ్మెల్యేల మధ్య యుద్ధం మాచర్ల వ్యవహారాల్లో యరపతినేని పెత్తనంపై జూలకంటి ఆగ్రహం తన సామాజిక వర్గానికి యరపతినేని ప్రోత్సాహం తాజాగా కారంపూడి ఎస్‌ఐ సస్పెన్షన్‌తో మరింత ముదిరిన వివాదం చివరికి పార్టీ అధినేత, చినబాబు వద్దకు చేరిన పంచాయితీ
సోమవారం శ్రీ 10 శ్రీ ఆగస్టు శ్రీ 2026
7
పిడుగురాళ్ల: పట్టణంలోని గంగమ్మకు ఆదివారం లక్ష పసుపు కొమ్ములతో విశేష అర్చన, అలంకరణ చేశారు. భక్తులు బోనాలు, పసుపు కొమ్ములు అమ్మవారికి సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొక్కులు తీర్చుకున్నారు.
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 28.7570 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు లీకేజీల ద్వారా వెళుతోంది.
నగరంపాలెం: గుంటూరు జిల్లాలోని పలు పోలీస్‌స్టేషన్లలో ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు ఆదివారం రౌడీషీటర్లకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు.
దుర్గమ్మ చెంత
భక్తజన జాతర
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఏకాదశి, వరస సెలువులు, ఆషాఢ మాసం ఆఖరి ఆదివారం కావడంతో ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ చెంత భక్తజన జాతర కనిపించింది. ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైన భక్తుల రద్దీ రాత్రి 9.30 గంటల వరకు నిర్విరామంగా కొనసాగింది. రద్దీ నేపథ్యంలో ఉదయం 7 గంటల నుంచే కొండపైకి కేవలం దేవస్థాన బస్సులు, ద్విచక్ర వాహనాలను మినహా ఇతర వాహనాలను అనుమతించలేదు ఉదయం 10 గంటల తర్వాత రద్దీ మరింత అధికం కావడంతో అంతరాలయ దర్శనాలను నిలిపివేసి అన్ని దర్శన టికెట్ల విక్రయాలను రద్దు చేశారు. బంగారు వాకిలి, రూ. 300, రూ. 100 టికెటు క్యూలైన్లతో పాటు సర్వ దర్శనం రెండు క్యూలైన్ల ద్వారా భక్తులకు దర్శనం కల్పించారు. రద్దీ తాకిడితో వీఐపీ క్యూలైన్‌తో పాటు సీఎం గేట్‌ను సైతం తెరిచి భక్తులను దర్శనానికి అనుమతించారు. సారెతో ఆలయానికి బయలుదేరిన భక్తులు తొలుత కనకదుర్గానగర్‌లో బలిపీఠం అమ్మవారిని దర్శించుకుని పసుపు, కుంకుమను సమర్పించారు. ఇతర జిల్లాల నుంచి ప్రత్యేకంగా ట్రాక్టర్లు, ఆటోలపై అమ్మవారి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఇంద్రకీలాద్రికి తరలిరావడం కనిపించింది. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, తీన్‌మార్ డప్పులతో , భక్తుల పూనకాలతో సారె సంబరం అంబరాన్ని తాకింది.
సారె సమర్పించిన బృందాలు
ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. ఆదివారం ఒక్క రోజే సుమారు వందకు పైగా భక్త బృందాలు అమ్మవారికి సారెను సమర్పించాయని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు.
దుగ్గిరాల: ఆషాఢ మాసం చివరి ఆదివారం దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల ఉత్సవం ఘనంగా నిర్వహించారు. పూలంగి సేవలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. చిలువూరుకు చెందిన రంగిశెట్టి జగదీష్ చండీ హోమం నిర్వహించారు. దాతల సహాయంతో మహిళలకు ఉచితంగా పొంగలి సామగ్రి అందించారు. పెద్ద సంఖ్యలో ఆలయ ఆవరణలో మహిళలు కట్టెల పొయ్యిలపై పొంగలి వండారు. మేళతాళాలు, కనక తప్పెట్లు మధ్య భక్తిశ్రద్ధలతో అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏర్పాట్లను ఆలయ నిర్వహణ కమిటీ పర్యవేక్షించింది.
ఇంద్రకీలాద్రి (విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో ఆదివారం సూర్యోపాసన సేవ ఘనంగా జరిగింది. లోక కల్యాణార్థం, సర్వ మానవాళికి సంపూర్ణ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ప్రతి ఆదివారం అమ్మవారి సన్నిధిలో సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు, సూర్యోపాసన సేవ జరుగుతున్నాయి. ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం వద్ద సూర్య భగవానుడి విగ్రహానికి అర్చకులు పూజలు చేశారు. అనంతరం అరుణ పారాయణం, మహా సౌర పారాయణం, సూర్య అష్టోత్తర శతనామావళిని పఠించారు. సూర్య భగవానుడిని ఆరాధించడంతో సంపూర్ణ ఆరోగ్యం.. చేపట్టిన పనుల్లో విజయం సిద్ధిస్తుందని పేర్కొన్నారు. అనంతరం సూర్యోపాసన సేవ జరిగింది. సేవలో పాల్గొన్న ఉభయదాతలను ప్రత్యేక క్యూలో అమ్మవారి దర్శనానికి అనుమతించారు.
విమానాశ్రయం(గన్నవరం): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం (గన్నవరం)లో ఆదివారం ఏపీస్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఏపీఎస్పీఎఫ్) ఆధ్వర్యాన ఇంటర్‌జోన్ వాలీబాల్ పోటీలు జరిగాయి. తొలుత పోటీలను ఏపీఎస్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ బీవీ రామిరెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. గెలుపే లక్ష్యంగా కాకుండా క్రమశిక్షణతో ఆడటం, ప్రత్యర్థిని గౌరవించడం నిజమైన క్రీడా స్ఫూర్తికి నిదర్శనమన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని విమానాశ్రయ డైరెక్టర్ ఎం.లక్ష్మీకాంతరెడ్డి తెలిపారు. ఇంటర్ జోన్‌లో భాగంగా ఏపీ సెక్రటేరియట్, ఏపీ హైకోర్టు, ఎన్‌టీటీపీఎస్, ఎయిర్‌పోర్ట్ యూనిట్, విజయవాడ గార్డ్స్, హెడ్ క్వార్టర్ యూనిట్ల మధ్య పోటీలు నిర్వహించారు. విజేతగా నిలిచిన జట్టుకు, ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు స్వాతంత్య్ర దినోత్సవాన బహుమతులు ప్రదానం చేయనున్నట్లు అసిస్టెంట్ కమాండెంట్ కె.రమేష్ తెలిపారు. విజయవాడ జోన్ కమాండెంట్ ఎం.శంకరరావు, ఎయిర్‌పోర్ట్ సీఎస్‌ఓ కె.ధర్మేంద్ర, పలువురు విమానాశ్రయ, ఎస్పీఎఫ్ అధికారులు పాల్గొన్నారు.
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 518.30 అడుగులకు చేరింది. సాగర్ జలాశయం నుంచి ఎస్‌ఎల్‌బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్‌ఫ్లోగా 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్ జలాశయానికి 13,435 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.
పల్నాడు ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల మధ్య కోల్డ్‌వార్ కాకరేపుతోంది. మాచర్ల నియోజకవర్గంలో గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పెత్తనం ఏంటని స్థానిక ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ప్రశ్నిస్తుండగా... మరోవైపు జూలకంటి వల్ల ఎన్నో ఏళ్లుగా టీడీపీ జెండా మోసిన కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారంటూ యరపతినేని వర్గం ఆరోపిస్తోంది. రెండు దశాబ్దాల తరువాత మాచర్లలో టీడీపీ గెలిచినా ఒక్క కార్యకర్తకు న్యాయం జరగలేదని కొందరు అంటుండగా, మరికొందరు పిన్నెల్లి ఎమ్మెల్యేగా ఉంటేనే బాగుండేదని వాపోతున్నారట. స్థానికులు మాత్రం ఇది కేవలం ఆర్థికపరమైన దోపిడీ వాటాల్లో వచ్చిన తేడాల వల్ల జరుగుతున్న ఆధిపత్య పోరు అని తేల్చిచెబుతున్నారు.
సాక్షి, టాస్క్‌ఫోర్స్: గతంలో మాచర్లలో టీడీపీ తరపున ప్రజాప్రతినిధి లేకపోవడంతో యరపతినేని శ్రీనివాసరావు గురజాలతోపాటు మాచర్ల నియోజకవర్గంలో ఆధిపత్యం ప్రదర్శించేవారు. ఆ విషయంలో ఇద్దరి మధ్య జరుగుతున్న కోల్డ్‌వార్ కాస్తా కారంపూడి ఎస్‌ఐ సస్పెన్షన్‌తో మరింత ముదిరింది. ఒకరికి ఒకరు హెచ్చరికలు జారీ చేసుకునే స్థాయికి వెళ్లింది. ఎస్‌ఐకు అనుకూలంగా ఓ వర్గం, వ్యతిరేకంగా మరో వర్గం గుంటూరు రేంజ్ ఐజీని కలిసి మీడియాకు ఎక్కారు.
కార్యకర్తలను పట్టించుకుంటే ఒట్టు
జూలకంటి బ్రహ్మారెడ్డి వాదన ఒకలా ఉంటే మాచర్ల టీడీపీ నేతలు, కార్యకర్తల ఆవేదన మరోలా ఉంది. గుంటూరులో ఉన్న వ్యక్తిని ఆర్థికంగా, రాజకీయంగా బలంగా మద్దతునిచ్చి ఎమ్మెల్యేగా గెలిపిస్తే మాకు దక్కిందేంటని ప్రశ్నిస్తున్నారు. తమ సమస్యలు, విన్నపాలు అడగడం అటుంచితే శుభకార్యాలకు ఆహ్వానం పలికినా పళ్లు కొరుకుతూ ఆగ్రహం వ్యక్తం చేయడమేంటని తలలు పట్టుకుంటున్నారట. అవినీతి, దోపిడీకి ఆస్కారం లేదంటూ కబుర్లు చెప్పి మట్టి, రేషన్ బియ్యం మొదలు ఆఖరుకు అంగన్‌వాడీల కోడిగుడ్ల వరకు తానే స్వయంగా సంపాదిస్తున్నాడంటూ తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. దీంతో తామే యరపతినేని వద్దకు వెళ్లి గోడు వెళ్లబోసుకున్నామంటూ చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే పార్టీ అధినేత, చినబాబు వద్ద మాచర్లలో టీడీపీ కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులను చెప్పుకున్నామని పేర్కొన్నారు. త్వరలో శుభవార్త వింటామంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారట. అధిష్ఠానం ఏ చర్య తీసుకుంటుందో చూడాలి.
ఆర్థికపరమైన వ్యవహారాలే కారణమా?
ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్న కోల్డ్‌వార్‌కు అసలైన కారణం ఆర్థికపరమైన వ్యవహారాలేనన్న అభిప్రాయం స్థానికుల నుంచి వినిపిస్తోంది. గ్రానైట్ రవాణా, సిమెంట్ ఫ్యాక్టరీల వంటి ఆర్థికపరమైన వ్యవహారాలు గత రెండు దశాబ్దాలుగా గురజాల నియోజకవర్గంతోపాటు మాచర్లలో సైతం యరపతినేని చూసేవారు. ప్రతి ఎన్నికకు ఓ కొత్త టీడీపీ అభ్యర్థి బరిలోకి దిగడం, ఓడిపోగానే క్రియాశీలకంగా లేకపోవడంతో యరపతినేని ఆ వ్యవహారాలు చూసుకునేవారు. అయితే ఈ దఫా జూలకంటి బ్రహ్మారెడ్డి ఎన్నికల్లో గెలవడంతో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందని సమాచారం. ఏదిఏమైనా పల్నాడు ప్రాంతంలో ఓ వైపు వైఎస్సార్‌సీపీ కదనోత్సాహంతో పార్టీ కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లోకి దూసుకెళ్తుంటే, సొంత పార్టీలో ప్రజాప్రతినిధులు రచ్చకెక్కడం ఏంటని టీడీపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఈ వ్యవహారం పార్టీ అధినేత చంద్రబాబు వద్దకు చేరిందని, పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
రాజకీయంగా అసాధ్యమనుకున్న మాచర్లలో టీడీపీ జెండా ఎగురవేసిన తనపై కుట్రలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి తన అనుచరులతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. కావాలనే ఓ సామాజికవర్గం వారు దుష్ప్రచారం చేస్తున్నారని వారిపై దుమ్మెత్తిపోస్తున్నారట. తాను మిర్చి డబ్బులు మోసపోయిన రైతుల పక్షాన నిలబడితే... యరపతినేని ఏకంగా ఆ ఎస్‌ఐపై సస్పెన్షన్ వేటు వేయించారని, అంత అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. కొందరు పోలీసు ఉన్నతాధికారులు యరపతినేనికి పక్షపాతం వహిస్తున్నారని... కారంపూడి ఎస్‌ఐ న్యాయపరంగా రైతుల పక్షాన పనిచేశారని, మరి పిడుగురాళ్ల, దాచేపల్లి పోలీసుస్టేషన్లలో జరుగుతున్న సివిల్ పంచాయితీల అరాచకాలపై సదరు పోలీసు ఉన్నతాధికారులు ఎందుకు స్పందించరని ఆగ్రహిస్తున్నారని సమాచారం. తన పదవీకాలం రెండేళ్లు కూడా పూర్తికాకముందే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ జూలకంటికి దక్కదని, మరో ఏడాదిలో టీడీపీ ఇన్‌చార్జిని నియమిస్తారని ప్రచారం చేయడం వెనుక భారీ కుట్ర దాగిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారట. మరోవైపు తనకు అనుకూలంగా ఉన్న సోషల్‌మీడియా, పత్రికల్లో యరపతినేనికి వ్యతిరేకంగా వార్తలు రాయించి తన ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారని వాపోతున్నట్లు తెలిసింది.


