ఆదివాసీల సంక్షేమం కోసం కృషి చేద్దాం | - | Sakshi
Sakshi News home page

ఆదివాసీల సంక్షేమం కోసం కృషి చేద్దాం

Aug 10 2026 2:10 AM | Updated on Aug 10 2026 2:10 AM

ఆదివాసీల సంక్షేమం కోసం కృషి చేద్దాం

మాచర్ల: మాచర్ల పట్టణంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఆదివాసీ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. తొలుత భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌, గిరిజన మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గిరిజన సంప్రదాయ నగారాను మోగించి విల్లు ఎక్కుపెట్టారు. ఈ సందర్భంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆదివాసీ సమాజం దేశ సంస్కృతి, సంప్రదాయాలు, ప్రకృతి పరిరక్షణలో ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ఆదివాసీల హక్కులు, సంక్షేమం, విద్య, వైద్యం, ఉపాధి తదితర రంగాల్లో మరింత అభివృద్ధి సాధించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆదివాసీ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని, వారి హక్కులను పరిరక్షించేందుకు ఐక్యంగా ముందుకు సాగాలని నాయకులకు పిలుపునిచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిలు గిరిజనులకు చేసిన మేళ్లను ఈ సందర్భంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వివరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన గిరిజన నాయకులను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ వివిధ హోదాల నాయకులు యెనుముల మురళీధర్‌ రెడ్డి, మేరాజోత్‌ హనుమంత్‌ నాయక్‌, రమావత్‌ జాన్‌పాల్‌ నాయక్‌, నూన్సావత్‌ రంగా నాయక్‌, రమావత్‌ సుబ్రహ్మణ్యం నాయక్‌, రమావత్‌ బ్రహ్మం నాయక్‌, రమావత్‌ మాధ్య నాయక్‌, సభావత్‌ రవి నాయక్‌, బానావత్‌ లచ్చ నాయక్‌, జరపల సుధాకర్‌ నాయక్‌, కేతావత్‌ శ్రీను నాయక్‌, కేతావత్‌ లచ్చ నాయక్‌, బానావత్‌ శ్రీను నాయక్‌, వడితే సైదా నాయక్‌, కళావత్‌ రాములు నాయక్‌, జరపలా గాంధీ నాయక్‌, వంకూడవత్‌ రవీంద్ర నాయక్‌. కాండ్రకొండ ఫ్రాన్సిస్‌ తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement