మనోవికాసానికి నృత్యం దోహదం | - | Sakshi
Sakshi News home page

మనోవికాసానికి నృత్యం దోహదం

Aug 10 2026 2:10 AM | Updated on Aug 10 2026 2:10 AM

మనోవికాసానికి నృత్యం దోహదం

నగరంపాలెం: నృత్యం మనోవికాసానికి దోహదపడుతుందని ఏపీ ప్రభుత్వం హైపవర్‌ కమిటీ చైర్మన్‌, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యు.దుర్గాప్రసాద్‌రావు అన్నారు. గుంటూరు బృందావన్‌గార్డెన్స్‌లోని వేంకటేశ్వరస్వామి దేవాలయంలో ఉన్న అన్నమయ్య కళావేదికపై మూడు రోజులుగా నిర్వహిస్తున్న కూచిపూడి నృత్యాలు ఆదివారంతో ముగిశాయి. రాష్ట్ర ప్రభుత్వ సృజనాత్మకత, సంస్కృతి సమితి సౌజన్యంతో నృత్య కిన్నెర కార్యదర్శి మద్దాలి రఘురామ్‌ నిర్వహణలో వేడుకలు జరిగాయి. అతిథులు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. అనంతరం హైదరాబాద్‌కు చెందిన నాట్య మయూర శిష్య బృందం ప్రదర్శించిన ‘ఇల వైకుంఠం’ కూచిపూడి నృత్య కీర్తనలకు మద్దాళి సౌందర్య నృత్య దర్శకత్వం వహించారు. నాట్యాచార్యులు ఎస్‌కే.ఖలీల్‌ రాధామాధవ నాట్యక్షేత్రం శిష్య బృందం ‘అచ్యుతం– కేశవం’ రాధాకృష్ణుల బృంద నాట్యం ప్రదర్శించారు. నృత్య కిన్నెర యాభై ఏళ్ల ప్రస్థానంలో అనేక అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని న్యాయమూర్తి అభినందించారు. సభలో సంస్థ అధ్యక్షులు డాక్టర్‌ ఆర్‌.ప్రభాకరరావు, నిర్వాహకులు పి.విజయకుమార్‌, కోశాధికారి కేవీ సుబ్బారావు పాల్గొన్నారు. చివరిగా అతిథులను, కళాకారులను నిర్వాహకులు సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement