మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాలి | - | Sakshi
Sakshi News home page

మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాలి

Jul 27 2026 1:48 AM | Updated on Jul 27 2026 1:48 AM

వైఎస్సార్‌సీపీ విద్యార్థి, యువజన విభాగాల నేతలు డిమాండ్‌ 28న నిరసన ర్యాలీ విజయవంతం చేయాలని పిలుపు పోస్టర్‌ ఆవిష్కరించిన పార్టీ నాయకులు

నరసరావుపేట: డీఎస్సీ నియామకాల్లో అవకతవకలకు సంబంధించి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాలని వైఎస్సార్‌సీపీ యువజన, విద్యార్థి విభాగాల జిల్లా అధ్యక్షులు కందుల శ్రీకాంత్‌, గుజ్జర్లపూడి ఆకాష్‌కుమార్‌లు డిమాండ్‌ చేశారు. పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో నరసరావుపేటలో ఈ నెల 28వ తేదీన నిర్వహించే నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని వారు కోరారు. జిల్లా పార్టీ కార్యాలయంలో కార్యక్రమ పోస్టర్‌ను పలువురు నాయకులతో కలసి ఆదివారం వారు ఆవిష్కరించారు. దగా డీఎస్సీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లపై సీఐడీ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. నిజాలు నిగ్గు తేల్చి యువజనులు, విద్యార్థులకు న్యాయం జరిగేంతవరకు పార్టీ తరఫున పోరాటం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థి విభాగ రాష్ట్ర జనరల్‌ సెక్రెటరీ ఉప్పుతోళ్ల వేణుమాధవ్‌, జిల్లా యువజన విభాగ ఉపాధ్యక్షుడు వెంకట యాదవ్‌, నియోజకవర్గ, పట్టణ విద్యార్థి విభాగం అధ్యక్షులు విజయరెడ్డి, మణీంద్రరెడ్డి, నరసరావుపేట, రొంపిచర్ల మండలాల విద్యార్థి విభాగ అధ్యక్షులు శాంత కుమార్‌ (బంటి), గెల్లి తేజరెడ్డి, జిల్లా విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శులు షోయబ్‌ అక్తర్‌, జానీబాషా, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement