మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి
గురజాల : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన సెల్ఫీల పోరాట ఫలితమే ఈ మెడికల్ కళాశాల అని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి అన్నారు. నగర పంచాయతీ పరిధిలోని జంగమహేశ్వరపురంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాసు మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ఒక బ్రహ్మాండమైనవె వైద్య దేవాలయానికి శంకుస్థాపన చేశామని దానికి రూ. 215 కోట్లతో భూములు సేకరించడంతో పాటు వైద్య కళాశాల, వైద్యశాలకు ఒక రూపు తీసుకురావడం జరిగిందన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో 90 శాతం భవనాలు పూర్తయినా టీడీపీ అధికారంలోకి వచ్చి సంవత్సరాలు గడిచినా ప్రారంభించలేకపోయిందన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు అవగాహన లేమి వల్ల ఆలస్యం అయిందని లేకపోతే 2024లోనే ప్రారంభించే అవకాశం ఉండేదన్నారు. కూటమి హయాంలో వైద్య కళాశాలను అమ్మకానికి పెట్టిందని వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు సెల్ఫీల ద్వారా అన్ని మాధ్యమాల్లో హల్‌చల్ చేయడంతో పాటు ప్రవాస భారతీయులు సైతం భాగస్వాములు కావడంతో వైద్యకళాశాల మనకు దక్కిందన్నారు. దీనికి తోడు కేంద్రం కూడా ఆసక్తి చూపకపోవడంతో టీడీపీ ప్రభుత్వం మెడికల్ కళాశాలల గురించి వెనకడుగు వేసిందన్నారు. మెడికల్ కళాశాలలో 100 సీట్లు కేటాయిస్తూ చెప్పడంతో కేంద్రంకు కాసు మహేష్‌రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెదకూరపాడు నియోజకవర్గ పరిశీలకుడు యెనుముల మురళీధర్‌రెడ్డి, మాచర్ల నియోజకవర్గ పరిశీలకుడు కొమ్మినేని వెంకటేశ్వర్లు, మండల కన్వీనర్ కొమ్మినేని బుజ్జి, వేముల చలమయ్య, బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు సిద్దాడపు గాంధీ, పట్టణ కన్వీనర్ కె. అన్నారావు, కె. చిన కోటేశ్వరరావు, తదితరులున్నారు.


