పల్నాడు | - | Sakshi
Sakshi News home page

పల్నాడు

Jul 10 2026 5:34 AM | Updated on Jul 10 2026 5:34 AM

శుక్రవారం శ్రీ 10 శ్రీ జూలై శ్రీ 2026 పులిచింతల సమాచారం

న్యూస్‌రీల్‌

నెలలుగా పనిచేయని ట్రాఫిక్‌ సిగ్నళ్లు మల్లమ్మ సెంటర్‌లో నిత్యం నరకం ప్రమాదాలు పెరుగుతున్నా కనీసం స్పందించని పోలీసు యంత్రాంగం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోని ప్రజాప్రతినిధులు

అరకొరగానే సిబ్బంది

శుక్రవారం శ్రీ 10 శ్రీ జూలై శ్రీ 2026

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 31.4607 టీఎంసీలు. ఎగువ నుంచి 400 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా, దిగువకు 3 వేల క్యూసెక్కులు వదలుతున్నారు.

జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో ట్రాఫిక్‌ సిగ్నళ్లు పనిచేయక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు ప్రజాప్రతినిధులుగానీ, అటు సంబంధిత ఉన్నతాధికారులుగానీ కన్నెత్తి చూసిన పాపానపోవడంలేదు. ముఖ్యంగా మల్లమ్మ సెంటర్‌లో నిత్యం వేల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. సిగ్నళ్లు వెలగక ఎప్పుడు ఎవరి ప్రాణాలు గాలిలో కలిసిపోతాయోనని వాహన చోదకులు బిక్కుబిక్కుమంటూ ప్రయాణాలు కొనసాగించాల్సిన దుస్థితి నెలకొంది.

నరసరావుపేట టౌన్‌: ప్రమాదాలను నివారించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు వినియోగించే సిగ్నళ్లు నెలల తరబడి పనిచేయడం లేదు. రూ.లక్షల ప్రజాధనంతో ఏర్పాటు చేసిన వాటి నిర్వహణను పూర్తిగా గాలికొదిలేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని అత్యంత రద్దీ కూడలి మల్లమ్మ సెంటర్‌. ఇక్కడ నిత్యం ట్రాఫిక్‌ నరకాన్ని తలపిస్తోంది. నాలుగు వైపుల నుంచి ఒకేసారి వాహనాలు దూసుకొస్తుండటంతో వాహనదారులు, పాదచారులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రమాదాల ముప్పు రోజురోజుకూ పెరుగుతున్నా సంబంధిత అధికారులు స్పందించకపోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రోజుకు 40 వేలకుపైగా వాహనాలు...

నరసరావుపేటలో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, వ్యాపార కేంద్రాలు అధికంగా ఉండటంతో రోజూ వేలాది మంది వివిధ ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. గుంటూరు, చిలకలూరిపేట, వినుకొండ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి వైపు నుంచి వచ్చే వాహనాలన్నీ ప్రధానంగా మల్లమ్మ సెంటర్‌ మీదుగానే ప్రయాణిస్తాయి. ట్రాఫిక్‌ పోలీసుల అంచనా ప్రకారం రోజుకు 40 వేలకుపైగా వాహనాలు ఈ కూడలి మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. ఇంతటి రద్దీ ఉన్న ప్రాంతంలో సిగ్నళ్లు పనిచేయకపోవడంతో మొత్తం అస్తవ్యస్తంగా మారుతోంది. చిన్నపాటి నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారితీసే పరిస్థితి నెలకొంది.

మరమ్మతులు చేసినా...

గతంలో సిగ్నళ్లు మొరాయిస్తే మరమ్మతులు చేశారు. కొద్దిరోజులు మాత్రమే పనిచేశాయి. అనంతరం అవి నిలిచిపోయాయి. అప్పటి నుంచి శాశ్వతంగా బాగు చేసే ఆలోచనే అధికారులకు లేకుండా పోయింది. పల్నాడు బస్టాండ్‌, గడియార స్తంభం సెంటర్‌, హార్డ్‌ కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్‌ సిగ్నళ్లు కూడా నెలలుగా పనిచేయక నిరుపయోగంగా మారాయి. రూ.లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన వ్యవస్థలు ఇలా నిర్లక్ష్యానికి గురికావడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు కూడా తమ సమస్యలు పరిష్కరించడానికి చర్యలు తీసుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇకనైనా స్పందించాలని కోరారు.

పట్టణంలో ట్రాఫిక్‌ సమస్యకు సిబ్బంది కొరత కూడా ప్రధాన కారణంగా మారింది. లక్షన్నర జనాభా ఉన్న నరసరావుపేటకు ట్రాఫిక్‌ సీఐ, ఇద్దరు ఎస్‌ఐలు, కేవలం 15 మంది సిబ్బంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం విద్యాసంస్థల సమయాల్లో మల్లమ్మ సెంటర్‌లో వాహనాలు భారీగా నిలిచిపోతున్నాయి. బస్సులు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు ఒకేసారి కూడలిలోకి రావడంతో ట్రాఫిక్‌ పూర్తిగా స్తంభిస్తోంది. అత్యవసర సేవల కోసం వెళ్తున్న అంబులెన్సులు కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. సిగ్నళ్లను వెంటనే మరమ్మతులు చేయాలని కోరుతున్నారు. పేటలోని రద్దీ కూడళ్లలో అదనపు ట్రాఫిక్‌ సిబ్బందిని నియమించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement