పొన్నూరు: 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి గుంటూరులోని కాపు హాస్టల్‌లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానించినట్లు హాస్టల్ కార్యదర్శి బాలిశెట్టి విజయ్‌కుమార్ తెలిపారు. గురువారం స్థానిక కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చి ఇంటర్మీడియెట్, డిగ్రీ, బీటెక్., పీజీ, ఎంఫిల్, పీహెచ్‌డి, ఎంబీఏ, ఎంసీఏ, సీఏ, ;సీపీటీ. తదితర విద్యా కోర్సుల్లో చదువుతున్న విద్యార్థులు కాపు హాస్టల్‌లో దరఖాస్తుకు అర్హులని అన్నారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్, ఏపీపీఎస్సీ, టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్, ఎస్‌ఎస్‌సీ, బ్యాంకింగ్, ఆర్‌ఆర్‌బీ తదితర పోటీ, ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు కూడా హాస్టల్‌లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కాపు, తెలగ, బలిజ, తూర్పు కాపు, మునూరు కాపు సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుందన్నారు. హాస్టల్‌లో భోజన సౌకర్యం, 24 గంటల గ్రంథాలయ సౌకర్యం, స్టడీ అవర్స్, జిమ్ వంటి సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. వివరాలకు 86865 55999 నెంబరుకు సంప్రదించాలని చెప్పారు. ఈ సందర్భంగా ప్రవేశాలకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. సమావేశంలో ఆకుల రామ్మోహన్‌రావు, దేగల వెంకటేశ్వరరావు, అమిరినేని సాంబశివరావు పాల్గొన్నారు.


