కేఎల్‌యూలో సౌత్‌జోన్‌ పురుషుల బాడ్మింటన్‌ టోర్నమెంట్‌ | - | Sakshi
Sakshi News home page

కేఎల్‌యూలో సౌత్‌జోన్‌ పురుషుల బాడ్మింటన్‌ టోర్నమెంట్‌

Jan 2 2026 11:12 AM | Updated on Jan 2 2026 11:12 AM

కేఎల్

కేఎల్‌యూలో సౌత్‌జోన్‌ పురుషుల బాడ్మింటన్‌ టోర్నమెంట్‌

తాడేపల్లి రూరల్‌: తాడేపల్లి రూరల్‌ పరిధిలోని వడ్డేశ్వరం కేఎల్‌ యూనివర్శిటీలో ఈనెల 3వ తేదీ నుంచి 5వరకు సౌత్‌జోన్‌ ఆలిండియా అంతర యూనివర్సిటీల పురుషుల బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ను నిర్వహించనున్నట్లు కేఎల్‌యూ వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ జి.పార్ధసారధి వర్మ తెలిపారు. ఈ సందర్భంగా గురువారం టోర్నమెంట్‌ పోస్టర్‌ను ప్రో.వైస్‌ చాన్స్‌లర్లు డాక్టర్‌ ఏవీఎస్‌ ప్రసాద్‌, డాక్టర్‌ ఎన్‌.వెంకట్‌రామ్‌, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ కె.సుబ్బారావు, క్రీడల డైరెక్టర్‌ డాక్టర్‌ హరికిషోర్‌, ఐక్యు ఏసీ డీన్‌ డాక్టర్‌ రామకృష్ణలతో కలసి ఆయన ఆవిష్కరించారు. అనంతరం వీసీ డాక్టర్‌ పార్ధసారధి వర్మ మాట్లాడుతూ క్రీడలతో విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు అలవడతాయన్నారు. ఈ టోర్నమెంట్‌లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన 128 విశ్వవిద్యాలయాల నుండి సుమారు 900 మంది క్రీడాకారులు పాల్గొంటారని పేర్కొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాప్‌ డైరెక్టర్‌ అనిమిని రవినాయుడు, గౌరవ అతిథిగా పున్నయ్య చౌదరిలు హాజరు కానున్నారని తెలిపారు.అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఇండోర్‌ స్టేడియంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. క్రీడల డైరెక్టర్‌ డాక్టర్‌ కె.హరికిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.

విజ్ఞాన్‌లో న్యూ ఇయర్‌ జోష్‌

చేబ్రోలు: వడ్లమూడిలోని విజ్ఞాన్‌ యూనివర్సిటీ, విజ్ఞాన్‌ లారా, విజ్ఞాన్‌ ఫార్మసీ, విజ్ఞాన్‌ జూనియర్‌ కాలేజీల విద్యార్థుల ఆధ్వర్యంలో గురువారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు కోటి ఆశలు, కొత్త సంకల్పాలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య కేక్‌ను కట్‌ చేసి విద్యార్థులతో ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. విద్యార్థులతో 2026 సంవత్సరానికి గాను సంకల్ప ప్రతిజ్ఞ చేయించి, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించేందుకు సరికొత్త మార్గాలను అన్వేషించాలన్నారు. విద్యార్థుల్లో దయ, కృతజ్ఞత, మానవత్వం, ఇతరులకు సహాయం చేసే మనస్తత్వం పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. నూతన టెక్నాలజీలపై అవగాహన పెంచుకున్న విద్యార్థులకే భవిష్యత్తులో మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. వేడుకల్లో వైస్‌ చాన్స్‌లర్‌ పి.నాగభూషణ్‌, రిజిస్ట్రార్‌ పీఎంవీ రావు, లారా, ఫార్మసీ, జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపాల్స్‌ ఫణీంద్రకుమార్‌, శ్రీనివాసబాబు, మోహన్‌ రావు, డీన్లు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

కేఎల్‌యూలో సౌత్‌జోన్‌ పురుషుల బాడ్మింటన్‌ టోర్నమెంట్‌ 1
1/2

కేఎల్‌యూలో సౌత్‌జోన్‌ పురుషుల బాడ్మింటన్‌ టోర్నమెంట్‌

కేఎల్‌యూలో సౌత్‌జోన్‌ పురుషుల బాడ్మింటన్‌ టోర్నమెంట్‌ 2
2/2

కేఎల్‌యూలో సౌత్‌జోన్‌ పురుషుల బాడ్మింటన్‌ టోర్నమెంట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement