శ్మశానానికి వెళ్లాలంటే ‘చావు’కొస్తోంది !
మండలంలోని అడవులదీవి పంచాయతీ పరిధిలోని భీమవారిపాలెంలో శ్మశానానికి వెళ్లడానికి గ్రామస్తులు నరకయాతన పడుతున్నారు. కచ్చా రహదారి సమస్యాత్మకంగా మారింది. గ్రామంలో ఎవరైనా మృతి చెందితే శవాన్ని శ్మశానవాటికకు తీసుకెళ్లడానికి అవస్థలు పడుతున్నారు. రహదారి చిత్తడిగా మారింది. ఇరువైపులా ముళ్ల చెట్లు ఉండటంతో మృతదేహాలను తీసుకెళ్లడం కష్టమవుతోంది. అడవులదీవి గ్రామానికి చెందిన గ్రామ పోతురాజు (రేమాల వీరాస్వామి) సోమవారం మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించడానికి గ్రామస్తులు నరకయాతన పడ్డారు. రహదారి అంతా చిత్తడిగా ఉండటంతో ప్రజలు అసహనానికి గురయ్యారు. అధికారులు స్పందించి బాగు చేయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
–నిజాంపట్నం


