ధూళిపాళ్లలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం
సత్తెనపల్లి: గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల గ్రామంలో బుధవారం లభ్యమైంది. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామంలో మృతదేహం ఉందని స్థానికులు సత్తెనపల్లి రూరల్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలాన్ని సందర్శించి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు. సుమారు 35–40 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి మృతదేహంపై మెరూన్ రంగు టీ షర్ట్, దానిపై ఎవరెస్ట్ అని ప్రింట్ చేసి ఉంది. గ్రే రంగు పాయింటు ధరించి ఉన్నాడు. నలుపు రంగు బెల్టు ఉండి బెల్ట్ బకెట్ ఆరంజ్, నలుపు రంగులో ఉంది. మృతుడి మెడకి రెండు తాయిత్తులు, కుడి చేతికి రబ్బర్ బ్యాండ్, నడుముకు నాలుగు పేటల నలుపు, ఎరుపు రంగుల మొలతాడు ఉంది. మృతుడు పొడవు సుమారు 5 అడుగుల 2 అంగుళాలు, నలుపు రంగులో ఉన్నాడు. మృతుని వివరాలు తెలిసినవారు సత్తెనపల్లి రూరల్ సీఐ 94407 96231, సత్తెనపల్లి రూరల్ ఎస్‌ఐ 80199 98643 నెంబర్లకు తెలియ చేయాలని పోలీసులు కోరారు.
వైభవంగా సీతారాముల ప్రతిష్టా మహోత్సవం
అమరావతి: మండలంలోని ఎనికపాడు గ్రామంలో హనుమత్, లక్ష్మణ సీతాసమేత రామచంద్రస్వామి వారి నూతన విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలు బుధవారం ఘనంగా నిర్వహించారు. యాజ్ఞిక బ్రహ్మ పరాశరం రామకృష్ణమాచార్యుల పర్యవేక్షణలో వైఖానసాగమంలో చంచాహ్నికహ్నిక దీక్షతో ఉత్సవాలను నిర్వహించారు. ప్రతిష్టా సుముహుర్తమైన 8గంటలకు తొలుత యంత్ర స్థాపనచేసి యాగశాల నుంచి స్వామివార్లను ఊరేగింపుగా తీసుకుని వచ్చి నూతనంగా నిర్మించిన ఆలయంలో ప్రతిష్టించారు. అనంతరం అత్యంత వైభవంగా జీవధ్వజ ప్రతిష్టాకార్యక్రమం నిర్వహంచారు. మహా పూర్ణాహుతి, కుంభప్రోక్షణ మహా సమారాధన నిర్వహించారు. ఽవిగ్రహ ప్రతిష్ట అనంతరం మొదట ధేను దర్శనం, దిష్టికుంభం, కన్యాదర్శనం అనంతరం ప్రథమార్చన నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం దేవాలయ నిర్వాహకులచే అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ, స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్‌లు కుటుంబసమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ధూళిపాళ్లలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం


