టీడీపీలో ఆధిపత్య పోరు | - | Sakshi
Sakshi News home page

టీడీపీలో ఆధిపత్య పోరు

Dec 24 2025 4:04 AM | Updated on Dec 24 2025 4:04 AM

టీడీప

టీడీపీలో ఆధిపత్య పోరు

టీడీపీలో ఆధిపత్య పోరు మొహం చాటేసిన జూలకంటి...

ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు...

ఎమ్మెల్యే జూలకంటి అసమర్థతతో వరుస హత్యలు, దాడులు

రేషన్‌, మట్టి మాఫియాకు

పాల్పడుతున్న టీడీపీ నేతలు

ఆధిపత్యం కోసం గ్రామాలలో

పెరిగిన వర్గ విభేదాలు

ప్రాథేయపడుతున్నా పరిష్కరించని

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి

గుంటూరు, హైదరాబాద్‌లలో

ఉంటూ కేడర్‌ను పట్టించుకోని నేత

వర్గ పోరు నేపథ్యంలో అడిగొప్పల,

గుండ్లపాడుల్లో జంట హత్యలు

దుర్గి మండలం పోలేపల్లిలో రేషన్‌ షాపు

కోసం సొంత పార్టీ దళితులపై దాడి

తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు

ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు

సాక్షి, నరసరావుపేట: మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ నాయకులు సహజ వనరులను కొల్లగొట్టి, రేషన్‌ బియ్యాన్ని పక్కదారి పట్టించి అక్రమార్జనకు తెరలేపారు. ఈ వాటాల పంపిణీ, గ్రామాలలో ఆధిపత్యం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ తదితర అంశాలపై వర్గపోరు అధికమైంది. వీటిని పరిష్కరించాల్సిన ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి గుంటూరు, హైదరాబాద్‌లలో ఉంటూ తన పొట్ట నింపుకుంటున్నాడని తెలుగు తమ్ముళ్లు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. గ్రామాలలో కక్షలు, కార్పణ్యాలు పెరుగుతున్నాయని వెళుతున్న క్యాడర్‌పై జూలకంటి విరుచుకుపడుతున్నాడని వాపోతున్నారు. బీపీ ఉందన్న సాకుతో నోటికొచ్చినట్టు మాట్లాడటం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

అడిగొప్పుల తెలుగుదేశం పార్టీలో తారాస్థాయికి చేరిన వర్గపోరును జూలకంటి పరిష్కరించి ఉంటే దశాబ్దకాలంగా పార్టీకి అండగా నిలిచిన ఇద్దరు కార్యకర్తలు హత్యకు గురయ్యేవారు కాదంటున్నారు. హత్యలో ప్రధాన నిందితుడు యాగంటి నరేష్‌ ఆగడాలు శృతిమించాయన్న సమాచారం ఉన్నా ఎమ్మెల్యే మిన్నుకుండిపోయాడంటున్నారు. హత్య జరిగి మూడు రోజులైనా ఇద్దరు కుమారులను కోల్పోయిన సొంత పార్టీ కార్యకర్తను పరామర్శించకపోవడమేంటని అడిగొప్పుల గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. జూలకంటి అసమర్థతను ప్రశ్నిస్తారని ఎన్ని రోజులు ఇలా మొహం చాటేస్తారంటున్నారు. దుర్గి మండలం పోలేపల్లి గ్రామంలో సైతం టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. రేషన్‌ డీలర్‌ కోసం ఆదివారం రాత్రి టీడీపీకి చెందిన దళితులపై అదే పార్టీకి చెందిన మరో వర్గం దాడి చేసింది. సుమారు 30 మంది దాకా వచ్చి చంపుతాం అంటూ కులదూషణ చేసి కర్రలు, కొడవళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఇలాంటి వివాదాలు దాదాపుగా అన్ని గ్రామాలలో ఉన్నాయి. వీటిని పరిష్కరించకపోతే దాడులు, హత్యలదాకా దారితీసే అవకాశముందని తెలుగు తమ్ముళ్లు హెచ్చరిస్తున్నారు.

వెల్దుర్తి మండలం గుండ్లపాడు వద్ద ఈ ఏడాది మే 24న జరిగిన జవిశెట్టి సోదరుల జంట హత్యలు సైతం అధికారపార్టీలోని వర్గపోరుతో జరిగాయి. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గుండ్లపాడులో ఉన్న జవిశెట్టి వెంకటేశ్వర్లు అలియాస్‌ మొద్దయ్య వర్గానికి, తోట వెంకట్రామయ్య వర్గానికి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది.

అత్యంత సమస్యాత్మకమైన, గతంలో సుమారు 17 మంది హత్యగావించబడ్డ గుండ్లపాడు గ్రామంలో రెండు వర్గాల మధ్య అగ్గిరాజుకున్న వెంటనే ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకొని ఉంటే హత్యల దాకా వెళ్లేది కాదు. దీన్ని కప్పిపుచ్చుకొనే క్రమంలో తనపై నిందను పోగొట్టుకోవడానికే హత్యతో ఏమాత్రం సంబంధంలేని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకట్రామిరెడ్డిల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చి సరికొత్త కుట్రకు తెరలేపాడంటున్నారు. ప్రస్తుతం పిన్నెల్లి సోదరులు నెల్లూరు జిల్లా జైలులో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా జరిగిన అడిగొప్పుల డబుల్‌ మర్డర్‌ను ఎవరిపై వేస్తారంటూ సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ జరుగుతోంది. ఇప్పటికై నా జూలకంటి నియోజకవర్గంలో జరుగుతున్న దోపిడీ, దోపిడీ వల్ల వస్తున్న వర్గ విభేధాలను పరిష్కరించాలని టీడీపీ కార్యకర్తలు కోరుతున్నారు. లేకపోతే ఈ దాడులు, హత్యలు ఆగవని భయాందోళనలో ఉన్నారు.

మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. ఫలితంగా సొంత పార్టీ వారినే హత్య చేస్తున్నారు. నియోజకవర్గంలోని నాయకులు రేషన్‌, మట్టి మాఫియాకు పాల్పడుతున్నారు. దీంతో నాయకుల మధ్య ఆధిపత్య పోరు సాగుతుంది. తమ ఆధిపత్యానికి అడ్డుగా ఉన్నారనే కారణంగా గుండ్లపాడు, అడిగొప్పులలో సొంత పార్టీ నాయకులనే కిరాతకంగా నరికి హత్య చేశారు. ఇప్పటివరకు ప్రశాంతంగా ఉన్న పల్నాడులో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ హత్యారాజకీయాలు మొదలయ్యాయి. సమస్యను పరిష్కరించాల్సిన స్థానిక ప్రజాప్రతినిధి నియోజకవర్గానికి దూరంగా ఉంటూ మౌనం వహిస్తున్నారు. అంతేగాక తన అసమర్థతను ప్రతిపక్షంపై నెడుతున్నారు. ప్రజాప్రతినిధి తీరుపై పార్టీ నాయకులు, కార్యకర్తలు రగిలిపోతున్నారు.

టీడీపీలో ఆధిపత్య పోరు 1
1/1

టీడీపీలో ఆధిపత్య పోరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement