సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలి
కేంద్రంలో బీజేపీ పొత్తుతో, రాష్ట్రంలో ముస్లిం ఓట్లతో అధికారంలోకి వచ్చిన టీడీపీ, వక్ఫ్ సవరణ చట్టం వల్ల మైనార్టీలో అతిపెద్దదైన ముస్లిం వర్గాలకు మతపరమైన రాజ్యాంగ హక్కు హరిస్తుందని..దానిని రద్దు చేయాలని కేంద్రాన్ని ఎందుకు ఒప్పించడం లేదో సీఎం చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి. ముస్లింల ఓట్లతో రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకున్న సీఎం చంద్రబాబు పార్లమెంట్, లోక్‌సభలో కేంద్రం తెచ్చిన వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసి, సదరు బిల్లు రద్దుకు సుప్రీంకోర్టులో పిల్ వేసే ధైర్యం ఉందా అంటూ సవాల్ విసిరారు.
– మాజీ మంత్రి విడదల రజిని


