బుధవారం శ్రీ 16 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): గుంటూరులో ఉద్యోగినుల వసతి కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రూ.2.27 కోట్లతో నిర్మించిన సఖినివాస్ ప్రస్తుత సర్కారు సాగదీత తీరు వల్ల ఇంకా అందుబాటులోకి రాలేదు. ఫలితంగా వసతి దొరక్క ఉద్యోగినులు అవస్థలు పడుతున్నారు. త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.
2023 చివరిలోనే పూర్తి
సఖి నివాస్(వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్) 2023 చివరిలోనే పూర్తయింది. 2024 సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో అప్పట్లో ప్రారంభం కాలేదు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా సఖి నివాస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేయలేదు. ఆ తరువాత కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల కోడ్ ఎత్తివేసిన తరువాత ఈ నెల 4న రాష్ట్ర గిరిజన సంక్షేమం, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సఖి నివాస్‌ను లాంఛనంగా ప్రారంభించారు. అయితే హాస్టల్‌ను ఇంకా అందుబాటులోకి తీసుకురాలేదు.
35 మంది దరఖాస్తు
సఖి నివాస్‌లో ఉండేందుకు 35 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా 30 మంది ఫోన్‌లో టచ్‌లో ఉన్నారు. ప్రభుత్వం రుసుములు ఖరారు చేయనిదే హాస్టల్ నిర్వహణ సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. ఉద్యోగినులు నిరాశ చెందుతున్నారు.
సఖి నివాస్‌కు తాళాలు వేసి ఉన్న దృశ్యం
సింగిల్ షేరింగ్ రూమ్
న్యూస్‌రీల్
గత ప్రభుత్వంలోనే సఖి నివాస్ నిర్మాణం పూర్తి ఉద్యోగినుల వసతి కోసం నిర్మించిన భవనం ఈ నెల 4న ప్రారంభించినా అందుబాటులోకి రాని దుస్థితి ప్రభుత్వం రుసుములు ఖరారు చేయకపోవడమే కారణం
సంస్థల నుంచి లేఖ తప్పనిసరి
సఖి నివాస్‌లో వసతి కోరే ఉద్యోగినులు పనిచేసే సంస్థ నుంచి లేఖలు సమర్పించాల్సి ఉంటుంది. వసతి గదుల్లో చేరే ముందు రూ.1500 అడ్వాన్స్ చెల్లించాలి. తిరిగి గది ఖాళీ చేసేటప్పుడు ఆ మొత్తం ఇస్తారు. విద్యార్థినులు కూడా ఇందులో వసతి పొందొచ్చు. అయితే సంబంధిత సంస్థల నుంచి లేఖలు సమర్పించాలి.
ఖరారు
కాగానే
అందుబాటులోకి..
వసతి గదుల రెంట్ ఫిక్స్
సఖినివాస్‌లో ఏసీ, నాన్ ఏసీ కలిపి మొత్తం 19 గదులు ఉన్నాయి. వీటి అద్దె ప్రతిపాదనలను అధికారులకు ప్రభుత్వానికి పంపారు. డబుల్ షేరింగ్ ఏసీ రూమ్ 1 (అద్దె నెలకు రూ.3,500), డబుల్ షేరింగ్ నాన్ ఏసీ రూమ్ 1 (అద్దె నెలకు 2,500), సింగిల్ షేరింగ్ ఏసీ రూమ్ 2(అద్దె నెలకు రూ.4,500), ఫైవ్ షేరింగ్ ఏసీ రూమ్స్ 4(అద్దె నెలకు రూ.2500), ఫైవ్ షేరింగ్ నాన్ ఏసీ రూమ్స్ 7(అద్దె నెలకు రూ.2,000), డార్మిటరీ నాన్ ఏసీ 8 షేరింగ్ రూమ్స్ 3(అద్దె నెలకు రూ.1,500), డార్మిటరీ ఏసీ 8 షేరింగ్ రూమ్ 1(అద్దె నెలకు రూ.200)గా అధికారులు ప్రతిపాదించారు. వీటిల్లో మొత్తం 92 మంది వరకు ఉండేందుకు అవకాశం కల్పిస్తారు. అయితే ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రాని కారణంగా అద్దెలు ఖరారు కాలేదు. ఫలితంగా వసతి గృహం ఇంకా అందుబాటులోకి రాలేదు. ఈ గదుల్లో ఆర్వో డ్రింకింగ్ వాటర్, గీసర్, వాషింగ్‌మెషిన్, టీవీ, బయోమెట్రిక్, సీసీ కెమెరాలు, ఇంటర్నెట్ సౌకర్యాలు ఉన్నాయి. ఆహారానికి అయ్యే ఖర్చును ఉద్యోగినులు భరించాలి. ఈ సఖినివాస్‌లో ఉద్యోగినుల కోసం పకడ్బందీ భద్రతా చర్యలు ఉన్నాయి. హాస్టల్ నుంచి బయటకు వెళ్లే టప్పుడు, వచ్చేటప్పుడు పేస్ ఆధారిత బయోమెట్రిక్ ఏర్పాటు చేశారు. వీటితోపాటు సీసీ కెమెరాల నిఘాలో హాస్టల్ ఉంటుంది. వసతి గృహం నిర్వహణకు ప్రత్యేకంగా మేనేజర్, వార్డెన్, ఇద్దరు వాచ్‌మెన్లు, ఇద్దరు శానిటేషన్ సిబ్బంది ఉంటారు. వీరి నియామానికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి వెళ్లాయి.
సఖి నివాస్‌లో మహిళా ఉద్యోగులు ఉండేందుకు ఏసీ, నాన్ ఏసీ రూమ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి అద్దె ప్రతిపాదనలను పూర్తి వివరాలతో ప్రభుత్వానికి నివేదించాం. రసుములు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు రాగానే నిర్వహణ ప్రారంభిస్తాం.
– బి.రమణ శ్రీ,
మహిళా ప్రాంగణం ఇన్‌చార్జ్జి మేనేజర్
బుధవారం శ్రీ 16 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
బుధవారం శ్రీ 16 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
బుధవారం శ్రీ 16 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
బుధవారం శ్రీ 16 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
బుధవారం శ్రీ 16 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025


