
బల్లికురవ ఎస్‌ఐని సస్పెండ్ చేయాలి
అద్దంకి రూరల్: పక్షపాత ధోరణితో టీడీపీకి కొమ్ముకాస్తున్న బల్లికురవ ఎస్‌ఐ నాగరాజును సస్పెండ్ చేయాలని వైఎస్సార్‌సీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి పానెం చినహనిమిరెడ్డి శుక్రవారం డిమాండ్ చేశారు. బల్లికురవ మండలంలోని ప్రజలంతా ఐకమత్యంగా, కులమతాలకు, పార్టీలకతీతంగా నిర్వహించుకునే ఈర్ల గంగమ్మ తిరునాళ్లలో ఉద్దేశపూర్వకంగా వైఎస్సార్‌సీపీ వారికి ప్రభలు కట్టుకునేందుకు అనుమతి ఇవ్వకపోవటం ఎస్‌ఐ పక్షపాత ధోరణికి నిదర్శనమన్నారు. తిరునాళ్లకు కాని, దేవాలయం వైపు కాని వైఎస్సార్ సీపీ నాయకులు రాకుండా చేస్తానని చెప్పటం ఏమిటని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ పాలనలో ఎటువంటి ఆంక్షలు పెట్టకుండా టీడీపీ వారికి తిరునాళ్లలో ప్రభలు కట్టేందుకు అనుమతులు ఇచ్చారన్నారు. ప్రజావ్యతిరేక పాలన చేస్తున్న కూటమి నాయకులు ప్రజల్లోని వెళ్లే ధైర్యం లేదన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబంపై సోషల్ మీడియాలో నీచంగా మాట్లాడించటం చంద్రబాబునాయుడు నైతికంగా దిగజారడన్నారు. ప్రశాంతంగా ఉండే బల్లికురవ మండలంలో గత వారం ప్రభలు కట్టేందుకు అప్పటి ఎస్‌ఐ జీవీ చౌదరి అనుమతులు ఇస్తే కొత్తగా వచ్చిన ఎస్‌ఐ అనుమతులు వైఎస్సార్‌సీపీ ఇవ్వకపోవటం ఏమిటని ప్రశ్నించారు. ప్రశాంతంగా ఉండే అద్దంకి నియోజకవర్గ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న నాగరాజు లాంటి ఎస్సైని ఉన్నతాధికారులు కల్పించుకుని సస్పెండ్ చేయాలన్నారు.
వైఎస్సార్‌సీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి పానెం చినహనిమిరెడ్డి