
నాగార్జునసాగర్ డ్యామ్‌పై హర్ ఘర్ తిరంగా ర్యాలీ
విజయపురిసౌత్: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ భద్రతా దళాల ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. సీఆర్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ గిరీష్ భట్ ఆధ్వర్యంలో భద్రతా బలగాలతో పాటు విద్యార్థులు జాతీయ జెండాలు చేతబట్టుకొని సాగర్ డ్యామ్‌పై భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. ర్యాలీగా విజయపురిసౌత్ కాలనీలో జరిగింది.అనంతరం మానవ హారంగా ఏర్పడ్డారు. గిరీష్ భట్ మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరులను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఎస్‌కె మహమ్మద్‌బాష, ఎన్‌సీసీ కెప్టెన్ కె. విజయకుమార్, జువాలజీ అధ్యాపకుడు టి. రాజశేఖర్, నాగార్జునకొండ సీఏ వెంకటయ్య, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
హాస్టళ్లలో సమస్యలు
పరిష్కరిస్తాం
దాచేపల్లి: సంక్షేమ వసతి గృహాల్లో సమస్యలను పరిష్కరిస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ గనోజ్ సూరజ్ అన్నారు. నారాయణపురంలోని ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. ఇటీవల ఈ హాస్టల్ లో జూనియర్ విద్యార్థిపై సీనియర్ విద్యార్థులు దాడి చేసి గాయపరిచిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన తీరును అక్కడున్న విద్యార్థులతోమాట్లాడి జేసీ తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ దాడి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. జేసీ వెంట ఆర్‌డీఓ మురళీకష్ణ, తహసీల్దార్ శ్రీనివాస్ యాదవ్, బీసీ వెల్ఫేర్ అధికారి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.
బీసీ హాస్టల్‌ను సందర్శించిన ఎమ్మెల్యే
నారాయణపురం ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహాన్ని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కూడా సందర్శించారు.
నేటి నుంచి త్రిశక్తి దుర్గాపీఠం వార్షిక బ్రహ్మోత్సవాలు
సత్తెనపల్లి: త్రిశక్తి స్వరూపిణులైన మహాలక్ష్మి, దుర్గ, సరస్వతి అమ్మవార్ల త్రిశక్తి దుర్గాపీఠం 19వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 13 నుంచి 15 వరకు వైభవంగా జరగనున్నాయని పీఠాధిపతులు వెలిదండ్ల హనుమత్ స్వామి మంగళవారం తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 108 కళాశాలతో అభిషేకాలు జరుగుతాయన్నారు. ప్రసన్నాంజనేయ స్వామి వారికి లక్ష నాగవల్లి దళాలతో (తమల పాకులు) విశేష పూజలు, శ్రీ జగన్నాథ భజన మండలి సభ్యుల కోలాటంతో అమ్మవార్ల ప్రభ ఉంటుందన్నారు. ముగింపు రోజు ముఖ్య శిష్యులచే గురుపూజ, అన్నప్రసాద వితరణ జరుగుతుందన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవార్ల కృపకు పాత్రులు కావాలని కోరారు.
ఘనంగా వినాయకునికి
సంకటహర చతుర్ధి పూజలు
అమరావతి: స్థానిక అమరేశ్వరాలయంలోని విఘ్నేశ్వరస్వామి ఉపాలయంలో మంగళవారం సంకటహర చతుర్ధి పూజలను ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకస్వామి జగర్లపూడి శేషసాయిశర్మ విఘ్నేశ్వర స్వామి వారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. స్వామి వారికి వివిధ రకాల ఫుష్పాలు, గరికతో విశేషాలంకారం చేశారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి ఉండ్రాళ్ళను సమర్పించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.

నాగార్జునసాగర్ డ్యామ్‌పై హర్ ఘర్ తిరంగా ర్యాలీ

నాగార్జునసాగర్ డ్యామ్‌పై హర్ ఘర్ తిరంగా ర్యాలీ