బుధవారం శ్రీ 13 శ్రీ ఆగస్టు శ్రీ 2025 | - | Sakshi
Sakshi News home page

బుధవారం శ్రీ 13 శ్రీ ఆగస్టు శ్రీ 2025

Aug 13 2025 5:08 AM | Updated on Aug 13 2025 5:08 AM

బుధవా

బుధవారం శ్రీ 13 శ్రీ ఆగస్టు శ్రీ 2025

సాక్షి, నరసరావుపేట: ఖరీఫ్‌ సీజన్‌లో సమృద్ధిగా వానలు కురిసాయి. నాగార్జున సాగర్‌ నీటిమట్టం పూర్తిస్థాయికి చేరి జూలై చివర వారంలోనే నీటిని కిందకు వదిలారు. దీంతో పల్నాడు జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌ సాగు పూర్తిస్థాయిలో ఉంటుందని అంతా అనుకున్నారు. అయితే ఖరీఫ్‌ సాగు ప్రారంభమై రెండున్నర నెలలైనా జిల్లాలో ఇప్పటివరకు సాధారణ లక్ష్యంలో కనీసం 30 శాతం కూడా పంటలు సాగుకాలేదు. ముఖ్యంగా పల్నాడు రైతులు ఎక్కువగా ఆధారపడే తెల్లబంగారమైన పత్తి పంట సంగతి సరే సరి. పత్తి సాగుకు రైతన్నలు ముందుకు రావడం లేదు.

గిట్టుబాటు ధర లేకపోవడమే...

పత్తి పంట సాగు తగ్గిపోవడానికి ప్రధాన కారణం పత్తి సాగు ఖర్చు పెరగడం, పంటలకు చీడపీడల ప్రభావం అధికంగా ఉండటం. గులాబీ రంగు పురుగుతో రైతులకు మందుల ఖర్చు అధికంగా అవుతోంది, మరోవైపు గులాబీ రంగు పురుగుతో దిగుబడి రాను రాను తగ్గిపోతోంది. ఓ వైపు పెట్టుబడి పెరిగి దిగుబడి తగ్గుతున్న క్రమంలో గిట్టుబాట ధర లేకపోవడం శాపంగా మారుతోంది. ఏటా తీవ్ర నష్టాలు చవిచూస్తున్న రైతులు పత్తిపంట సాగుకు విముఖత చూపుతున్నారు. దీంతో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టిపెడుతున్నారు. గత కొన్నేళ్లుగా పల్నాడు ప్రాంతంలో పత్తిసాగు చేసిన రైతులు తీవ్ర నష్టాలను చవిచూడటంతో మొక్కజొన్న సాగుతోనైనా తమ వెతలు తీరుతాయని రైతులు భావిస్తున్నారు.

పిడుగురాళ్ల రూరల్‌ మండల పరిధిలో పత్తిసాగు

న్యూస్‌రీల్‌

సాగర్‌ నిండినా, సమృద్ధిగా వర్షాలు కురుస్తున్న ముందుకు సాగని ఖరీఫ్‌ పత్తి సాగుకు గడువు ముగుస్తున్నా ముందుకురాని రైతులు 91,566 హెక్టార్ల సాధారణ సాగుకు గాను 35,958 హెక్టార్లలోనే.. గులాబీ రంగు పురుగు ఉధృతితో పెరుగుతున్న పెట్టుబడి, తగ్గుతున్న దిగుబడులు ప్రభుత్వ ‘మద్దతు’ కూడా లేని వైనం మొక్కజొన్న, అపరాల పంటల వైపు మొగ్గుచూపుతున్న కర్షకులు

లక్ష్యంలో సగమైనా లేదు

జిల్లా సాధారణ లక్ష్యం ఈ ఖరీఫ్‌లో 91,566 హెక్టార్లు కాగా ప్రస్తుతానికి కేవలం 35,958 హెక్టార్లలో సాగైంది. పత్తి పంట సాగుకు అనువైన సమయం దాదాపుగా పూర్తయిందని రైతులు అభిప్రాయపడుతున్నారు. ఇక మీదట సాగు చేసే పత్తి పంటకు చివర్లో గులాబీ రంగు పురుగుల బెడద అధికంగా ఉండి తీవ్రంగా నష్టపోతామంటున్నారు. దీంతో ఈ ఏడాది ఖరీఫ్‌లో పత్తి పంట సాగు 40 వేల హెక్టార్లు కూడా దాటే పరిస్థితి లేదంటున్నారు.

గిట్టుబాటు ధర లేదు

గతంలో పత్తి, మిర్చి పంటలను అధికంగా సాగుచేసేవాడిని. కానీ అధిక వర్షాలు, గులాబీ రంగు పురుగు ఉధృతితో పాటు, గిట్టుబాటు ధర లేక పత్తి పంట సాగు గణనీయంగా తగ్గించుకున్నాను. రైతులు గత కొంత కాలంగా కంది, మొక్కజొన్న వంటి ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టిసారిస్తున్నారు. ఈ పంటలకు పెట్టుబడి తక్కువ ఉండటం, అధిక ఆదాయం ఉండటం కలసి వస్తుంది.

– వెంకట్రామిరెడ్డి, రైతు, రెడ్డిపాలెం, రొంపిచర్ల మండలం

బుధవారం శ్రీ 13 శ్రీ ఆగస్టు శ్రీ 20251
1/3

బుధవారం శ్రీ 13 శ్రీ ఆగస్టు శ్రీ 2025

బుధవారం శ్రీ 13 శ్రీ ఆగస్టు శ్రీ 20252
2/3

బుధవారం శ్రీ 13 శ్రీ ఆగస్టు శ్రీ 2025

బుధవారం శ్రీ 13 శ్రీ ఆగస్టు శ్రీ 20253
3/3

బుధవారం శ్రీ 13 శ్రీ ఆగస్టు శ్రీ 2025

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement