పట్నంబజారు: నగరంలోని ఆటోమొబైల్స్ గోడౌన్‌లో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిమాపకశాఖ ఏడీఎఫ్‌వో కృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గౌరీశంకర్ థియేటర్ సమీపంలోని బాలాజీ ఆటో మొబైల్స్ గోడౌన్‌లో ప్రమాదవశాత్తూ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గోడౌన్‌లో ఉన్న రూ. 40 లక్షల విలువ చేసే ఆటోమొబైల్ వస్తువులు అగ్నికి ఆహుతైనట్లు యజమాని ప్రవీణ్‌కుమార్ తెలిపారు. అయితే, అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్‌తో జరిగిందా.. బాణసంచా వల్ల సంభవించిందా? అని తెలియాల్సి ఉంది. ప్రమాదం సంభవించిన ప్రాంతంలో ఆసుపత్రులు ఉన్న దృష్ట్యా భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.