నాణ్యమైన విద్యే ప్రభుత్వ లక్ష్యం

కారెంపూడిలో 8వ తరగతి విద్యార్థులను 
అభినందిస్తున్న  ప్రవీణ్‌ ప్రకాష్‌  - Sakshi

కారెంపూడి: నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించడానికి ప్రభుత్వం అత్యుత్తమ పథకాలు చేపట్టిందని పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాష్‌ వెల్లడించారు. మండలంలోని మిరియాల గ్రామంలోగల జెడ్పీ హైస్కూల్‌ను ఆయన శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ నాడు నేడు కింద జరుగుతున్న పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాభివృద్ధికి రూపొందించిన పథకాల అమలుకు మంచి ఫండింగ్‌ కూడా ఉందనీ, వాటిని మనసా వాచా కర్మేణ బెస్ట్‌గా అమ లు చేసి బెస్ట్‌ షో కనబర్చాలని పాఠశాల విద్యా శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాష్‌ పిలుపునిచ్చారు.

విద్యార్థులు రెండు సెక్షన్‌లలో నేలపై కూర్చోవడాన్ని గమనించి సంబంధిత అధికారులపై తీవ్ర స్థాయి లో ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. నాడు నేడు పనుల్లో ఫస్ట్‌ ప్రయార్టీ క్లాస్‌ రూంలకు ఇవ్వాలని అధికారులకు క్లాస్‌ తీసుకున్నారు. వెంటనే వీడి యో కాన్ఫరెన్స్‌ ద్వారా నాడు నేడు అమలులో భాగస్వాములుగా ఉన్న అన్ని శాఖల అధికారులను లైన్‌లోకి తీసుకుని దీనిపై వారికి కూడా స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. విద్యార్థులు రోజూ 8 గంటల పాటు కూర్చుని విద్యాభ్యాసం చేసేందుకు అనువైన ఆహ్లాదకరమైన అన్ని సౌకర్యాలు క్లాస్‌ రూమ్‌లో ఉండాలని ఆదేశించారు. రెండవ ప్రాధాన్యత టాయిలెట్స్‌కు ఇవ్వాలని ఆ తర్వాత ఇతర అభివృద్ధి పనులు చేయాలని ఆదేశించారు. పనులు నిర్లక్ష్యంగా చేస్తే ఇంటికి పంపుతానని తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

అభ్యసనా సామర్థ్యాలు భేష్‌

మిరియాల జెడ్పీ హైస్కూల్లో 8వ తరగతి విద్యార్థుల క్లాస్‌ రూంకు వెళ్లి ‘ది బాండ్‌ ఆప్‌ లవ్‌’ ఇంగ్లిష్‌ పాఠ్యాంశంలో విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలను పరీక్షించారు. అన్ని వర్క్‌బుక్స్‌ను స్వయంగా ఆయనే సేకరించి పరిశీలించారు. మంచిగా ఉండడంతో ఇంగ్లిష్‌ టీచర్‌ జీవీఎల్‌ నరసింహా రావును విద్యార్థులను అభినందించారు. అనంతరం ప్రైమరీ స్కూలుకు వెళ్లి అక్కడ 4వ తరగతి విద్యార్థులకు అందుతున్న బోధనను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. జగనన్న గోరుముద్ద పథకం కింద విద్యార్థులకు అందుతున్న భోజనాన్ని పరిశీలించారు. ఆర్‌జేడీ సుబ్బారావు, పల్నాడు జిల్లా డీఈఓ కె.సామ్యేలు, సత్తెనపల్లి డిప్యూటీ డీఈఓ ఎ వెంకటేశ్వర్లు, తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి, కారెంపూడి, గురజాల ఎంఈఓలు వి.నాగయ్య, ఎస్‌వీఆర్‌ ప్రసాద్‌ మండలంలోని అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

అందుకోసమే అత్యుత్తమ

పథకాల నిర్వహణ

విద్యాశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి

ప్రవీణ్‌ ప్రకాష్‌

Read latest Palnadu News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top