రాయగడ: స్థానిక కళాకారులు, సంప్రదాయ చేతి వృత్తుల వారికి మార్కెటింగ్ అవకాశాలు కల్పించడంతోపాటు వారి ఆర్థిక స్వాలంబనకు తొడ్పడే లక్ష్యంతో స్థానిక రైల్వే స్టేషన్‌లో వన్ స్టేషన్–వన్ ప్రొడక్ట్ స్టాల్‌ను శనివారం ప్రారంభించారు. కేంద్ర సూక్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వశాఖ ఽఆధ్వర్యంలోని పీఎం విశ్వకర్మ యోజనలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ స్టాల్‌లో రాయగడకు చెందిన దివ్యాంగ కళాకారుడు తలవలస శ్రీనివాస్ చేతితో రూపొందించిన మట్టి పాత్రలు, ఇతర మట్టి వస్తువులను విక్రయానికి అందుబాటులో ఉంచారు. పీఎం విశ్వకర్మ యోజన ద్వార కుమ్మరి వృత్తిని కొనసాగిస్తున్న శ్రీనివాస్‌కు తన ఉత్పత్తులను విస్తృత మార్కెట్‌కు పరిచయం చేసుకునే అవకాశం లభించింది. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సాహించాలనే వొకల్ ఫర్ లోకల్ లక్ష్యానికి ఈ కార్యక్రమం దొహదపడనుంది. ఈ స్టాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక రైల్వే స్టేషన్ మేనేజర్ నంద పాఠక్, జిల్లా పరిశ్రమల కేంద్రం మాజీ అసిస్టెంట్ మనేజర్ సవ్యసాచి సాహు, ఎంఎస్‌ఎంఈ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ ఎన్.కె.రత్నం, కటక్ ఎంఎస్‌ఎంఈ డీఎఫ్‌ఓ అసిస్టెంట్, డైరెక్టర్ అభిషిత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.


