సోకు సిబ్బందిది..! | - | Sakshi
Sakshi News home page

సోకు సిబ్బందిది..!

Oct 25 2026 1:35 AM | Updated on Oct 25 2026 1:35 AM

ట్రస్ట్‌ హాల్‌కు తాళాలు వేయిస్తాం

అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల హడావుడి

సొమ్ము

భక్తులది...

తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా నెలకు ఇలాంటి ఖర్చులను మిస్‌లీనియస్‌ హెడ్‌లో, అలాగే పిలిగ్రిమ్‌ ఫెసిలిటీస్‌ పేరిట ఖర్చులు చూపించేసి ఎంచక్కా ‘బుక్కేస్తున్నారు’.

నెల ఖర్చులు రూ.29 వేలు..?

ఆలయంలో గత రెండున్నరేళ్లుగా ఖర్చులు విపరీతంగా పెరిగాయి. ఆలయ పరిసరాల్లో అభివృద్ధి, భక్తులకు సౌకర్యాల కోసం ఆలయ ఈవో ఆధ్వర్యంలో చాలావరకు పనులు చేపట్టారు. అయితే ఎప్పటికప్పుడు పనులంటూ ఎలా చూసినా.. రోజూ ఇక్కడ లేబర్‌ ఖర్చులతో రికార్డుల్లో నమోదవుతుంటాయి. ఆలయంలో ఖర్చులతో పాటు సిబ్బంది తింటున్న ఖర్చులు కూడా ఇదే జాబితాలో కలిసిపోయేలా జాగ్రత్తలు పాటిస్తున్నారు. సిబ్బంది వ్యక్తిగత ఖర్చులను కూడా మిస్‌లీనియస్‌ హెడ్‌ ఖర్చుల కిందే ఆడిట్‌కు చూపిస్తున్నారు ఇక్కడి అధికారులు. అయితే ఏ ఖర్చు అయినా రూ.30 వేలు దాటితే టెండర్‌, కొటేషన్‌ అంటూ నిబంధనలుంటాయి. వీటిని తప్పించుకునేందుకు వీలుగా రూ.29 వేల వరకు మాత్రమే పరిమితం చేస్తూ ఖర్చులు చూపిస్తూ ఓచర్లు రాసేసి చెక్‌లు సిద్ధం చేసి ఈవోతో సంతకాలు చేయిస్తున్నారు. అలాగే రూ.5 వేల వరకు అయితే లేబర్‌ ఖర్చులంటూ మస్తర్‌ ఫారం మీద వివరాలు రాసేసి ఎలాంటి చెక్కు అవసరం లేకుండానే అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేసేస్తారు. ఇలా వీరు తింటున్న టిఫిన్‌ ఖర్చులు, స్నాక్స్‌ ఖర్చులతో పాటు వారి వ్యక్తిగత అవసరాలకు క్యాంపులకు వెళ్లినా.. ఆ ఖర్చులు కూడా ఇదే హెడ్‌లో ఏవో ఖర్చులంటూ చూపించి ఆలయ ఖజానాను కరిగించేస్తున్నారు. దీంతో ఆలయంలో ఇలాంటి అక్రమ విధానంలో ఖర్చులు చేస్తున్న కొందరి చేష్టలను, సోకులను చూసి కొందరు ఆధారాలతో సహా విజిలెన్స్‌ అధికారులకు పంపించారని సమాచారం.

ఆలయ పాలకమండలి సభ్యుల సమావేశ మందిరంలో ఎవరూ టిఫిన్లు చేయకుండా చర్యలు చేపడతాం. ఆ హాల్‌కు తాళాలు వేయిస్తాను. ఏ ఉద్యోగి కూడా అనుమతి లేకుండా ఆ గదిలోకి వెళ్లకుండా చర్యలు చేపడతాము.

– డి.వెంకటరమణ, సూపరింటెండెంట్‌

అరసవల్లి: ఏ ఆలయంలోనైనా భక్తులు మొక్కుల రూపంలో హుండీలో వేసే డబ్బులను ఆలయంలో అభివృద్ధి పనులు, ఉద్యోగుల జీతభత్యాలు, భక్తుల సౌకర్యాల కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో మాత్రం వీటన్నింటితో పాటు సిబ్బంది వ్యక్తిగత భోజన, రవాణా ఖర్చులు కూడా ఆలయ ఖజానాలో నుంచే ఖర్చులు చూపించేస్తున్నారు. ఇలా భక్తుల సొమ్ములతో సిబ్బంది సోకులు కొడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా.. ఆలయ ఈవో ఏమాత్రం దృష్టి పెట్టకుండా ప్రోత్సహిస్తున్నారనే దిశగా ఆలయ వర్గాల్లో చర్చసాగుతోంది. ముఖ్యంగా ఆలయ పరిపాలనా విభాగంలో పనిచేస్తున్న అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందితో పాటు ఒకరిద్దరు రెగ్యులర్‌ ఉద్యోగులు కూడా వ్యక్తిగత ఖర్చులను చెక్కులుగా మార్చుకుంటూ తమ జీతాల్లో లోటు లేకుండా జాగ్రత్తలు పడుతున్నారు. తాజాగా ఆలయంలో నెలవారీ ఖర్చులు చూస్తుంటే, సిబ్బంది వ్యక్తిగత ఖర్చులు, టిఫిన్లు, టీ, కాఫీలతో పాటు సాయంత్రం స్నాక్స్‌, ఫ్రూట్‌ సలాడ్స్‌ వంటి ఖర్చులు కూడా ఆలయ ఖజానా నుంచే వినియోగిస్తున్నట్లుగా స్పష్టమవు

ఆలయంలో పనిచేస్తున్న ఒకరిద్దరు అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల హడావుడి చూస్తే.. తాము గ్రూప్‌–1 అధికారుల కంటే ఎక్కువ అన్నట్లుగా ప్రవర్తిస్తుంటారు. నిజానికి వీరు అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులే అయినప్పటికీ, ఆలయ పరిపాలనా విభాగంలో వీళ్ల మాటే శాసనంలా మారింది. వీళ్లు ఏం చెక్కులు చూపిస్తే వాటిని గుడ్డిగా సంతకం చేసే పరిస్థితుల్లో ఇక్కడి అధికారులు వ్యవహరిస్తున్నారనే చర్చ జోరందుకుంది. ఇదిలావుంటే ఈ ఉద్యోగుల వ్యక్తిగత వినియోగ ఖర్చులు కూడా ఆలయ ఖజానాకు కన్నం వేస్తున్న క్రమంలో ఆలయ పాలక మండలి (ట్రస్ట్‌ బోర్డు) సమావేశ మందిరాన్ని ఏకంగా డైనింగ్‌ హాల్‌గా మార్చేశారంటే అతిశయోక్తి కాదు. దీనిపై ఎన్ని విమర్శలు వస్తున్నా.. అధికారులకు పట్టడం లేదు. రోజూ ఉదయం 10 గంటలకల్లా ఈ ఉద్యోగులకు ఇక్కడే టిఫిన్‌ తిని, టీ, కాఫీలు కూడా ఇక్కడే తాగుతారు. అలాగే మధ్యాహ్నం అనంతరం వీలైతే రెస్ట్‌, సాయంత్రం స్నాక్స్‌ ఇక్కడే తినే పరిస్థితి. ఆలయంలో మంచినీరు అందుబాటులో ఉన్నప్పటికీ తాగరు. బయట దుకాణాల నుంచి కొత్తగా మినరల్‌ వాటర్‌ బాటిల్స్‌ను తెప్పించుకుంటారు.

ఆదిత్యాలయంలో సిబ్బంది అతి చేష్టలు

వ్యక్తిగత ఖర్చులు కూడా ఆలయ ఖజానా నుంచే..!

అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు రోజూ టిఫిన్లు, వాటర్‌ బాటిల్స్‌ ఖర్చులు

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement