పర్లాకిమిడి: ఒడిశా రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు భక్తచరణ్ దాస్‌ను భుభనేశ్వర్లోని కాంగ్రెస్ భవన్లో రాష్ట్ర కాంగ్రెస్ సాధారణ కార్యదర్శి జాస్మిన్షేక్, డి.సి.సి అధ్యక్షుడు శంకర్ ప్రధాన్, గుసాని సమితి కాంగ్రెస్ అధ్యక్షుడు ఎ.శ్రీనివాసరావు, బీసీ సెల్ నాయకులు ఎస్.పాపారావు, కె.బాలకృష్ణ శనివారం కలిశారు. గజపతి జిల్లాలో వచ్చే ఏడాది మార్చిలో జరుగనున్న పురపాలక సంఘం, పంచాయతీ ఎన్నికలు పురస్కరించుకుని పార్టీ బలోపేతం చేస్తామని కాంగ్రెస్ నాయకులు అన్నారు. మండల, పంచాయతీ స్థాయిలో కార్యకర్తల్లో ఉత్సాహాం కల్పించడానికి భక్తచరణ్ దాస్‌ను కలిసినట్టు జాస్మిన్షేక్ తెలియజేశారు. ఏ.ఐ.సి.సి నాయకులు కె.టి.కుసుం కుమార్, ఒడిశా కాంగ్రెస్ ప్రభారీ లాల్జీ పదేశాయిని కూడా గజపతి జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యులు కలిసి మాట్లాడారు.


