పాతపట్నం: మండలంలోని కొరసవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయుడు ఎం.రామారావు తెలిపారు. శనివారం శ్రీకాకుళం ఆర్కే స్టేడియంలో జరిగిన అథ్లెటిక్స్ పోటీల్లో బాలుర అండర్–17 విభాగంలో 100 మీటర్ల పరుగు పందెంలో గుడియా ధనుకుమార్ ప్రథమ స్థానంలో, అండర్–19 బాలికల విభాగంలో 800 మీటర్ల పరుగు పందెంలో ఆర్.వినీత ద్వితీయ స్థానం సాధించారు. దీంతో రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపికై నట్లు హెచ్ఎం తెలిపారు. ఎంపికై న విద్యార్థులను పీఈటీ కృష్ణారావు, ఉపాధ్యాయులు, కొరసవాడ గ్రామస్తులు అభినందించారు.
ఎన్నికల విధులపై ఉపాధ్యాయులకు శిక్షణ
● డీఈవో రవిబాబు
శ్రీకాకుళం: జిల్లాలో పోలింగ్ అధికారులుగా విధులు నిర్వహించేందుకు ప్రతి మండలం నుంచి ముగ్గురు ఉపాధ్యాయులను ఎంపిక చేసి శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డీఈవో రవిబాబు తెలిపారు. స్థానిక అంబేడ్కర్ ఆడిటోరియంలో డీపీవో స్వరూపారాణి, సెట్ శ్రీ సీఈవో వి.విశ్వేశ్వరరావు పర్యవేక్షణలో శిక్షణా కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో రవిబాబు మాట్లాడుతూ.. ఈ శిక్షణ ద్వారా సంబంధిత ఉపాధ్యాయులకు అవసరమైన విధివిధానాలు, కార్యక్రమాల అమలు, బాధ్యతల నిర్వహణపై అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు. నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో సాధించేందుకు ఈ శిక్షణా కార్యక్రమం దోహదపడుతుందని, ఉపాధ్యాయులు శ్రద్ధగా శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్స్ బలివాడ సతీష్ కుమార్, కె.శేషగిరి, పి.నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
షాపులకు బహిరంగ వేలం
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా ఆర్మెడ్ రిజర్వ్ ఎచ్చెర్ల పోలీసు విభాగం పరిధిలో జాతీయ రహదారిని ఆనుకుని పోలీసు సిబ్బంది విశ్రాంత గృహ సముదాయంలో ఉన్న 6 షాపులను అద్దె ప్రాతిపదికన కేటాయించేందుకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి ఉన్న వ్యక్తులు ఈనెల 27వ తేదీ ఉదయం 10 గంటలకు ఎచ్చెర్లలోని పోలీసు కల్యాణ మండపంలో నిర్వహించనున్న వేలంలో పాల్గొనాలన్నారు. వివరాల కోసం 63099 90841, 94416 20032 నంబర్లను సంప్రదించాలన్నారు.
విద్యుత్ షాక్‌తో
కాంట్రాక్ట్ ఉద్యోగి మృతి
మందస: మండలంలో విద్యుత్ షాక్‌తో కాంట్రాక్ట్ ఉద్యోగి శనివారం ఉదయం మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ సహాయక ఉద్యోగిగా పనిచేస్తున్న కరణం వీధికి చెందిన సిందిరి బలరాం (51) విధి నిర్వహణలో భాగంగా స్తంభంపైకి ఎక్కారు. అక్కడ విద్యుత్ లైన్ సరిచేస్తుండగా ఒక్కసారిగా షాక్ కొట్టడంతో స్తంభంపై నుంచి కిందపడ్డారు. తీవ్రగాయాలు పాలైన బలరాంను ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొని వెళ్తుండగా మార్గమధ్యలో మరణించాడు. విషయం తెలిసిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆ కుటుంబాన్ని పరామర్శించారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
మందస: మండలంలోని కొత్తపల్లి సమీపంలో ఉన్న జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒడిశా రాష్ట్రానికి చెందిన హరి(55) కొత్తపల్లి నుంచిి ఇచ్ఛాపురం వైపు జాతీయ రహదారిపై రాంగ్ రూట్లో వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది. నేలపై పడివున్న హరిని స్థానికులు చూసి హైవే పోలీసులకు సమాచారం ఇచ్చారు. హైవే పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని తీవ్రగాయాలతో ఉన్న హరిని హరిపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు తెలియజేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కొత్తూరులో విషాదం
కొత్తూరు: కొత్తూరులోని శ్రీకాకుళం రోడ్డులో నివాసముంటున్న సొంట్యాన కృష్ణారావు(45) తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లో శనివారం అకస్మాత్తుగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యు లు తెలిపారు. దీంతో కొత్తూరులో విషాదఛాయలు అలుముకున్నాయి. కృష్ణారావు హైదరాబాద్‌లో సివిల్ హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తూ 2007 నుంచి కుటుంబంతో నివాసం ఉంటున్నా రు. కృష్ణారావు మృతదేహాన్ని కొత్తూరు తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. మృతుడికి భార్య నాగమణి, ముగ్గురు పిల్లలు ఉన్నారు.


