26 నుంచి 29 వరకు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు | - | Sakshi
Sakshi News home page

26 నుంచి 29 వరకు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు

Oct 25 2026 1:11 AM | Updated on Oct 25 2026 1:11 AM

పర్లాకిమిడి: ఒడిశా వాతావరణ శాఖ, ఐఎండీ హెచ్చరికల మేరకు వచ్చే 26 సాయంత్రం నుంచి 27, 28, 29 వరకు ఏ జిల్లాలో భారీ వర్షాలు కురువనున్న దృష్ట్యా కలెక్టరేట్‌లో పాలనాధికారి అక్షయ సునీల్‌ అగర్వాల్‌ వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో శనివారం సమావేశం అయ్యారు. జిల్లాలోని ఏడు సమితి కేంద్రాలు, తహసీల్దార్లు, బీడీఓలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, గుమస్తాలకు సెలవులు రద్దు చేశామని జిల్లా కలెక్టర్‌ ప్రకటించారు. ముఖ్యంగా ననువాగడ, రామగిరి, గుమ్మ బ్లాక్‌లలో తుపాను వల్ల కొండచరియలు విరగడం, ఇళ్లు కూలడం వంటివి ఎదుర్కొవడానికి అధికారులు అప్రమత్తంగా ఉండాలని, రోడ్లు–భవనాల శాఖ ముందుగా జేసీబీలు ఏర్పాటుచేయాలని, ఓడ్రాఫ్‌ సిబ్బంది చెట్లును తొలగించడానికి కట్టర్లు ఇతర తుఫాను సామగ్రిని వెంటనే అందుబాటులో ఉంచాలని కలెక్టర్‌ ఆదేశించారు. కర్వాచౌత్‌ భీకర తుపాను వల్ల ప్రస్తుత దసరా సెలవులు ఈనెల 26 నుంచి 29 వరకూ ప్రీ ప్రైమరీ నుంచి ప్లస్‌టు జూనియర్‌ కళాశాలలకు సెలవును రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

రాష్ట్రపతి పర్యటన వాయిదా

● నవంబర్‌ నాలుగు, ఐదో తేదీలకు మార్పు

భువనేశ్వర్‌: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన సొంత జిల్లా రాయ్‌రంగ్‌పూర్‌లో చేపట్టాల్సిన రెండు రోజుల పర్యటన వాయిదా పడింది. తుఫాన్‌ హెచ్చరికల నేపథ్యంలో వాయిదా పడినట్టు తెలిసింది. ఈ నెల 28, 29 తేదీల్లో మయూర్‌భంజ్‌ జిల్లాలోని రాయ్‌రంగ్‌పూర్‌లో పర్యటించాల్సి ఉంది. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితులు, బంగాళా ఖాతంలో ఏర్పడుతున్న తుఫాన్‌ ప్రభావం కారణంగా ఈ పర్యటనను వారం రోజుల పాటు వాయిదా వేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్రపతి పర్యటనను నవంబర్‌ నాలుగు, ఐదో తేదీలకు రీషెడ్యూల్‌ అయిందని మయూర్‌భంజ్‌ కలెక్టర్‌ ప్రకటించారు. ఆమె రెండు రోజుల ఒడిశా పర్యటన సందర్భంగా, రాయ్‌రంగ్‌పూర్‌, బహల్డా, గోరుమహిసానిలోని మా కీచకేశ్వరి ఆలయాన్ని సందర్శించి, ఆమె స్థానిక ప్రాంతంలోని అనేక ఇతర కార్యక్రమాలకు హాజరుకానున్నారు.

ఇంద్రావతి గేట్లు ఎత్తివేత

కొరాపుట్‌: నబరంగ్‌పూర్‌ జిల్లా వాసుల నెత్తి మీద మరో పిడుగు పడింది. శనివారం సాయంత్రం అప్పర్‌ ఇంద్రావతి హైడ్రో ఎలక్ట్రికల్‌ ప్రాజెక్ట్‌ రిజర్వాయర్‌లలో పుడాఘడ్‌ డ్యామ్‌లో మూడు, ఐదో నంబర్‌ గేట్లను 0.5 మీటర్ల ఎత్తు వరకు ఎత్తి నీరు దిగువ ప్రాంతానికి వదిలారు. ఈ నీరు ఆదివారం ఉదయానికి నబరంగ్‌పూర్‌కి చేరుకుంటుందని ప్రకటించారు. ఇంద్రావతి నదీ తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అందుకు తగ్గ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆటోల్లో మైక్‌ ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. గత నెలలో ఇదే విధంగా తుఫాన్‌ వచ్చినప్పుడు ముందస్తు హెచ్చరిక లేకుండా గేట్లు ఎత్తి వేయడం తో ప్రజలు తీవ్రంగా నష్ట పోయారు. నెల తిరగకుండా మరోసారి గేట్లు ఎత్తి వేయడం తో ప్రజలు భయపడుతున్నారు.

కాసీపూర్‌లో ఏనుగు సంచారం

● గ్రామస్తులు భయాందోళన

రాయగడ: జిల్లాలోని కాసీపూర్‌లో ఏనుగు హల్‌చల్‌ సృష్టించింది. శుక్రవారం సాయంత్రం ఒక ఏనుగు సమితి కార్యాలయం వద్దకు చొరబడింది. అనంతరం అక్కడి నుంచి కార్యాలయానికి సమీపంలో ఉన్న గౌడొవీధిలోకి చొరబడిన ఏనుగు పచర్లు కొట్టింది. దీంతో వీధిలో ఉన్న వారు ఏనుగును చూసి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలోకి పరుగులు తీసి తలుపులు వేసుకుని ప్రాణాలను అరిచేతిలో పట్టు కుని ఉన్నారు. సుమారు గంటన్నరపాటుగా ఏనుగు వీధిలో తిరిగి చివరకు అక్కడ నుంచి సమీపంలోని అడవిలోకి వెళ్లిపోయింది. ఏనుగు వెళ్లడం గమనించిన స్థానికులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది ఏనుగు వెళ్లిన ప్రాంతాన్ని పరిశీలించారు. అయితే సాయంత్రం సమయంలో అంతా ఇళ్లల్లో ఉండాలని ఒకవేళ ఏనుగు వస్తే దాని దగ్గరకు వెళ్లకుండా తమకు సమచారం ఇవ్వాలని సూచించారు. మూడు రోజులుగా ఈ ప్రాంతంలో ఏనుగు సంచరిస్తున్నట్లు స్థానికులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement