పర్లాకిమిడి: గజపతి జిల్లా రాయఘడ బ్లాక్ మర్లబ ఘాటి పర్సల్ గ్రామం వద్ద కారులో 23 ప్లాస్టిక్ క్యాన్లలో నాటుసారాను నువాగడ బ్లాక్ ఖోజురిపదా గ్రామానికి అక్రమంగా రవాణా చేసుండగా ఎకై ్సజ్ పోలీసులు శనివారం మధ్యాహ్నం పట్టుకున్నారు. దసరా పూజలు సందర్భంగా పర్లాకిమిడి అబ్కారీశాఖ బృందం పెట్రోలింగ్ నిర్వహించారు. 460 లీటర్ల నాటుసారా క్యాన్లను పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి కారుడ్వైర్ గగన శోబోరోను అరెస్టుచేసి కోర్టుకు తరలించినట్టు ఎస్ఐ తిరుపతి పట్నాయక్ తెలియజేశారు. ఈ పెట్రోలింగ్లో అబ్కారీ ఓఐసీ భుబన్ కుమార్ బెహరా, ఏ.ఎస్.ఐ నీలాంబర్ నాయక్, సర్వేశ్వరరావు, ఎం.ధర్మారాజు, మినాతీ పాయక్ తదితరులు పాల్గొన్నారు.


