కొరాపుట్: నవంబర్ ఆఖరు లోపు భారత మాల రోడ్డు నిర్మాణం పూర్తి కానుంది. శుక్రవారం ఆంధ్రా–ఒడిశా సరిహద్దు సుంకి సమీపంలో కవల టన్నెళ్లు వద్ద భారత మాల జాతీయ రహదారి అధికారులు ఈ విషయం వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో వ్యయ ప్రయాసలతో విశాఖ పట్నం నుంచి రాయ్పూర్ వరకు 6 అంచెల ఎకనామిక్ కారిడర్ నిర్మిస్తోంది. ఇందు కోసం రూ.20 వేల కోట్ల పైగా వెచ్చించింది. ఈ రోడ్డు ఒడిశాలో కొరాపుట్, నబరంగ్పూర్ జిల్లాలలో మాత్రమే వెళ్తుంది. ఒడిశాలో ఈ రోడ్డు నిర్మాణం దాదాపు పూర్తయ్యింది. నవంబర్ నెలాఖరు లోపు ఒడిశాలో ఈ రోడ్డు నిర్మాణం వంద శాతం పూర్తవుతుంది. ఇక మిగిలిన చత్తీస్గఢ్, ఆంధ్ర ప్రదేశ్లలో కొద్ది భాగాల్లో నిర్మాణం పూర్తి కావా ల్సి ఉంది. ఆయా ప్రాంతాలలో కూడా వచ్చే ఏడాది జనవరి నెలాఖరు లోపు పూర్తి కావస్తుంది. దాదాపుగా పిభ్రవరి నెలలో ఈ రోడ్డు ప్రజల అందుబాటులోనికి రానున్నది. ట్వీన్ టన్నెల్ ఈ రోడ్డు నిర్మాణంలో ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. ఈ టన్నెళ్ల వద్ద ప్రస్తుతం శాశ్వత హెలిప్యాడ్ నిర్మాణం చేస్తున్నారు. రోడ్డు మెత్తం పూల మెక్కలు పెంపకానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. టన్నెల్ లోపలి భాగం లో పూర్తి విద్యుద్దీకరణ, తాగునీరు, గాలి సరఫరా, ఒడిశా రాష్ట్ర వైభవం తెలిపే కుడ్య చిత్రాలు ఏర్పాటు చేశారు.


