రైల్వే సేవలపై అభిప్రాయ సేకరణ | - | Sakshi
Sakshi News home page

రైల్వే సేవలపై అభిప్రాయ సేకరణ

Oct 18 2026 1:12 AM | Updated on Oct 18 2026 1:12 AM

రాయగడ: రైల్వే స్టేషన్లు, రైళ్లలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు పరిశుభ్రతను మరింత పటిష్టం చేసేందుకు రాయగడ రైల్వే డివిజన్‌ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈమేరకు ప్రత్యేక అభియాన్‌ 6.0 కార్యక్రమంలో భాగంగా రాయగడ, కొరాపుట్‌, జగదల్‌పూర్‌, అరకు ప్రాంతాల్లో రైల్‌ జన సంవాద్‌ కార్యక్రమాన్ని శనివారం నిర్విహించి, ప్రయాణికులతో రైల్వే అధికారులు నేరుగా మాట్లాడి వారి సమస్యలు, అవసరాలు, సూచనలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో యువ ప్రయాణికులతొ అధికారులు సంభాషించి రైలు ప్రయాణ సమయంలో ఎదురువుతున్న ఇబ్బందులు, మెరుగుపరచాల్సిన సౌకర్యాలపై అభిప్రాయాలను సేకరించారు. ఇందుకోసం ప్రయాణికులకు అభిప్రాయ సేకరణ పత్రాలను పంపిణీ చేశారు. ప్రయాణికుల నుంచి వచ్చిన సూచనల ఆధారంగా రైల్వే సేవలను మరింత మెరుగుపరిచేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతోందని అధికారులు భావిస్తున్నారు. అలగే రైల్వే స్టేషన్లు, రైళ్లలో పరిశుభ్రతను కాపాడాల్సిన ఆవశ్యకతపై ప్రయాణికులు, ప్రజలకు అవగాహన కల్పించారు. చెత్తను పొడి, తడి వ్యర్థాలుగా వేరు చేయడం, బాధ్యతాయుతంగా చెత్తను పారవేయడం, రైల్వే ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచడంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. ఈ కార్యక్రమాలకు రాయగడ రైల్వే డివిజన్‌ ముఖ్య వైద్య పర్యవేక్షకుడు డాక్టర్‌ సంజీవ్‌ కుమార్‌ సాహు నాయకత్వం వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement