లోయలోకి బోల్తాకొట్టిన ట్యాంకర్‌ | - | Sakshi
Sakshi News home page

లోయలోకి బోల్తాకొట్టిన ట్యాంకర్‌

Oct 18 2026 1:12 AM | Updated on Oct 18 2026 1:12 AM

● డ్రైవర్‌కు స్వల్ప గాయాలు

రాయగడ: జిల్లాలోని టికిరిలో ఉన్న ఉత్కళ అల్యూమిన కర్మాగారం నుంచి ఆంధ్ర వైపు వెళుతున్న భారీ ట్యాంకర్‌ గుమ్మఘాటి మలుపు వద్ద అదుపుతప్పి లోయలోకి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో డ్రైవరు స్వల్ప గాయాలతో బయటపడి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి జరిగినట్లు సమాచారం. శుక్రవారం సాయంత్రం టికిరి అల్యూమిన కర్మాగారం నుంచి బయలు దేరిన ట్యాంకర్‌ అర్ధరాత్రి సమయంలో గుమ్మఘాటీకి చేరుకునే సరికి ఘాటీ మలుపులో అదుపుతప్పి సుమారు 50 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ఘటనలో డ్రైవరు చాకచక్యంగా ట్యాంకర్‌ నుంచి కిందకు దూకేయడంతో స్వల్పగాయాలు తగిలాయి.

కంటైనర్‌ ట్రక్కును ఢీకొన్న మినీ ట్రక్కు

● డ్రైవర్‌ మృతి

భువనేశ్వర్‌: శనివారం నగరం శివార్లలోని జాంలా ఓవర్‌బ్రిడ్జిపై కంటైనర్‌ ట్రక్కును వెనుక నుంచి మినీ ట్రక్కు ఢీకొంది. ఈ దుర్ఘటనలో మినీ ట్రక్కు డ్రైవర్‌ మృతి చెందాడు. కంటైనర్‌ ట్రక్కును ఢీకొన్న ధాటికి మినీ ట్రక్కు నుజ్జునుజ్జు అయిన వాహనంలో డ్రైవర్‌ చిక్కుకుపోయాడు. ఘటనా స్థలంలో జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. అగ్నిమాపక బృదం ఘటనా స్థలానికి చేరి దెబ్బతిన్న వాహనం నుంచి డ్రైవర్‌ను బయటకు తీసి ఆస్పత్రికి తరలించగా, అక్కడ వైద్యులు అతను మరణించినట్లు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement