8 కేసుల్లో 14 మంది అరెస్టు | - | Sakshi
Sakshi News home page

8 కేసుల్లో 14 మంది అరెస్టు

Sep 24 2026 2:30 AM | Updated on Sep 24 2026 2:30 AM

● మారణాయుధాలతో పాటు వివిధ సామగ్రి సీజ్‌ ● వివరాలు వెల్లడించిన జయపురం సబ్‌డివిజన్‌ పోలీసు అధికారి అర్పిత మాట్టల్‌

● మారణాయుధాలతో పాటు వివిధ సామగ్రి సీజ్‌ ● వివరాలు వెల్లడించిన జయపురం సబ్‌డివిజన్‌ పోలీసు అధికారి అర్పిత మాట్టల్‌

జయపురం: జయపురం పట్టణ పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగిన దోపిడీలు, దొంగతనాలు, పలు నేరాలకు సంబంధించి ఎనిమిది కేసుల్లో 14 మందిని అరెస్టు చేసినట్లు జయపురం సబ్‌డివిజన్‌ పోలీసు అధికారి అర్పిత మాట్టల్‌ తెలిపారు. పట్టణ పోలీసు స్టేషన్‌ సభా గృహంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసుల వివరాలను వెల్లడించారు. నిందితుల నుంచి పెద్ద ఎత్తున నగదు, ఇత్తడి సామాన్లు, విద్యుత్‌ వైర్లు, వివిధ మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు ఆమె వెల్లడించారు. గత జూలై 28వ తేదీన సాయంత్రం జయపురం పవర్‌ హౌస్‌ కాలనీలో సంతోష్‌ కుమార్‌ త్రిపాఠీ ఇంట్లో రూ. రెండు లక్షలు దొంగతనం జరిగింది. ఆ కేసులో సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.కె.మిశ్ర దర్యాప్తు జరిపారు. ఈ కేసులో బెడా సాహి గ్రామంలో ఉమాశంకర నాయిక్‌ అనే యువకుడిని అరెస్టు చేసి అతని నుంచి రూ. 80 వేలుీ స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. అలాగే బొయిపరిగుడ ప్రాంతంలో తిలోచంద్ర పొడియ తన కుమార్తె చికిత్స కోసం భూమిని తనఖా పెట్టి డబ్బు తీసుకువచ్చి కొరాపుట్‌ వెళ్లేందుకు బస్సు స్టాండ్‌లో వేచి ఉండగా దుండగులు అతన్ని కత్తితో బెదిరించి రూ. 20 వేలు దోచుకుపోయారు. ఈ కేసును ఎస్‌ఐ ఆర్‌.మహకూర్‌ దర్యాప్తు జరిపారు. దీనికి సంబంధించి జయపురంలో సుమిత్‌ బెహర, నందపూర్‌ అరుణ బెహరలను అరెస్టు చేసి వారి నుంచి రూ. 15 వేలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మేదరిసాహిలో ఎ.మోహణ్‌ ఆగస్టు 30వ తేదీన తన తండ్రి చికిత్స కోరకు విశాఖపట్నం వెళ్లాడు. ఆ సమయంలో ఇంటి తాళాలు విరిచి దొంగతనం జరిగింది. ఈ కేసుని ఏఎస్సై జి.సిహంసద దర్యాప్తు జరిపి నిందితులు బాదల్‌ కుమార్‌ పూజారి, సాహిల్‌ డొంగిరి, గణేష్‌ ముధులిలను అరెస్టు చేశారు. వారి నుంచి దొంగిలించిన డబ్బుతో పాటు ఇత్తడి సామాన్లను స్వాధీన పరచుకున్నట్లు వివరించారు. అలాగే ప్రసాదరావుపేటలో నిర్మాణంలో ఉన్న ఒక భవనంలో విద్యుత్‌ వైర్లు దొంగతనం జరిగింది. ఆ కేసుని ఏఎస్సై ఆర్‌.పంగి దర్యాప్తు జరిపారు. పార్క్‌ లైన్‌ రాజా గౌఢతో పాటు ఒక మైనర్‌ బాలుని అరెస్టు చేశారు. పారాబెడ లక్ష్మీనరశింగ సాహి మందిరంలో పూజా సామగ్రితోపాటు ఇత్తడి వస్తువులు దొంగిలించన కేసును ఏఎస్సై సతన కుమార్‌ పాత్రోదర్యాప్తు జరిపి నిందితులు గణేష్‌ హరిజన్‌, పింటు హరిజన్‌లను అరెస్టు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసు అధికారి వెల్లడించారు. వారి నుంచి దొంగిలించిన సామాన్లను స్వాధీన పరచుకున్నట్లు వెల్లడించారు. ఇందార్‌లో కనూ కనస్ట్రక్షన్‌ యజమాని అఖిలేష్‌ పటేల్‌ నుంచి మూడు డంపర్లు అద్దెకు తీసుకెళ్లి రూ. 40 లక్షలు చెల్లించకుండా మోసగించిన జయపురం ఇరిగేషన్‌ కాలనీకి చెందిన బి.అరుణోదయ దాస్‌పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అలాగే శాంతినగర్‌లో బి.శబరీష్‌ ఇంట్లో దుండగులు చొరబడి కత్తి చూపి డబ్బు దోచుకుపోయిన కేసులో జయపురం సదర్‌ పోలీసు స్టేషన్‌ పరిధికి చెందిన అర్జున హరిజన్‌, మహేశ్వర్‌ బిశాయిలను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. మరో కేసులో బలిపెటసాహిలో పంచానన మందిరం కూడలి ఒక మహిళకు దారుణంగా కొట్టి ఆమె మొబైల్‌, డబ్బు దోచుకుపోయిన కేసుని ఏఎస్సై పి.ఆర్‌.బారిక్‌ దర్యాప్తు జరిపి కుంధ్ర, బొయిపరిగుడ ప్రాంతాలకు చెందిన సుకాంత హరిజన్‌, రాజేష్‌ పొరజలను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. వారి నుండి ఒక మొబైల్‌, ఒక కత్తి ఒక బైక్‌లను సీజ్‌ చేసినట్లు వెల్లడించారు. పాత్రికేయుల సమావేశంలో పట్టణ పోలీసు అధికారి ఉల్లాష్‌ చంధ్ర రౌతోతోపాటు కేసులు దర్యాప్తు చేసిన పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement