● పూర్తిగా కోలుకోకముందే రోగి డిశ్చార్జి
● జిల్లా కేంద్రాస్పత్రిలో ఉద్రిక్తత
జిల్లాకేంద్ర ఆస్పత్రి
రాయగడ: పూర్తిగా కోలుకోకముందే 16 ఏళ్ల బాలికను ఆస్పత్రి నుంచి డిశ్చార్చి చేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలతో జిల్లా ప్రధాన హాస్పిటల్‌లో శుక్రవారం కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాసీపూర్ సమితి గోరఖ్‌పూర్ పంచాయతీలోని కానుగుడ గ్రామానికి చెందిన బాలిక జ్వరం బారినపడడం వలన ప్లేట్‌లెట్లు, హెమోగ్లోబిన్ తగ్గిపోవడంతో ఆస్పత్రిలో చికిత్స కోసం కుటుంబ సభ్యులు చేర్పించారు. అయితే చికిత్స పూర్తి కాకముందే, ఆరోగ్యం మెరుగుపడకముందే బాలికను డిశ్చార్జి చేసేందుకు ఆస్పత్రి సిబ్బంది ప్రయత్నించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో సామాజిక కార్యకర్త బలరాం పండ జోక్యం చేసుకుని ఆస్పత్రి అధికారులతో మాట్లాడారు. అనంతరం వైద్యాధికారులు బాలికను మళ్లీ మెడిసిన్ వార్డులో చేర్పించి చికిత్స ప్రారంభించారు.


