రాయగడ : రైల్వే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాయగడ రైల్వే డివిజినల్ మేనేజరు అమితాబ్ సింఘాల్ పిలుపునిచ్చారు. స్వచ్చత పక్షోత్సవం సందర్భంగా రైల్వే అధికారులు, సిబ్బందితో ఆయన స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. స్వచ్ఛతను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని, రైల్వే స్టేషన్లు, కార్యాలయాలు, ఇతర రైల్వే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ చురుగ్గా సహకరించాలని ఆయన సూచించారు. స్వచ్ఛతపై ప్రయాణికులు, సాధారణ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రాయగడ రైల్వే డివిజన్‌లో వీధి నాటకం నిర్వహించారు. చెత్తను సక్రమంగా నిర్వహించడం, రైల్వే పరిసరాలను బాధ్యతాయుతంగా వినియోగించడం, స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ డివిజినల్ మెకానికల్ ఇంజనీర్ ప్రవీణ్ భాటి సంబంధిత అధికారులు, సిబ్బంది సహకారంతో నిర్వహించారు.


