పర్లాకిమిడి: పర్లాకిమిడి మాజీ శాసన సభ్యులు త్రినాథ సాహు వర్ధంతిని స్థానిక తెలుగు సోండివీధి వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి కాంగ్రెస్ శ్రేణులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పర్లాకిమిడి నియోజకవర్గంలో పురపాలక సంఘం చైర్మన్‌గా, పలు సహకార సంఘాలకు డైరెక్టర్గా, అధ్యక్షునిగా, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా త్రినాథసాహు సేవలందించారని గుర్తు చేసుకున్నారు. పాతపట్నం రామరాజు చారిటబుల్ ట్రస్టు అధినేత పి.రామరాజు కసాహూ విగ్రహానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బసంత పండా, సంగ్రాం సాహు, కుమారుడు మనోజ్ సాహు, బర్నాల జనార్దనరావు, పట్టణ యువజన కాంగ్రెస్ నాయకులు సూర్యనారాయణ పాత్రో తదితరులు పాల్గొన్నారు.


