రాయగడ: సంప్రదాయ కళకు తన ప్రతిభను జోడించి అరుదైన గుర్తింపు పొందిన రాయగడకు చెందిన సంజుక్త కుమారి రాష్ట్రస్థాయి హస్తకళ, చేనేత కళాకారుల సన్మానాన్ని అందుకున్నారు. పూరీలొ నిర్వహించిన రాష్ట్రస్థాయి హస్తశిల్ప, హస్తతంతు శిల్పి సన్మాన్ ఉత్సవం–2026లో ఆమె రూపొందించిన ప్రత్యేకమైన సొరకాయ ఆర్ట్‌కు శిల్పి ప్రతిభా సన్మాన్‌తో ఘనంగా సత్కరించారు. పవిత్రగురు దినోత్సవాన్ని పురస్కరించుకుని సంప్రదాయ హస్తకళ గురుకులం, భండారికూడా, బ్రహ్మగిరి, పూరీతో పాటు సంపర్క్–పూరీ సంయుక్త ఆధ్వర్యంలో పూరీలోని సంస్కృతి భవన్‌లో నిర్వహించిన 14వ వార్షికోత్సవం, రాష్ట్రస్థాఽయి హస్తకళ–చేనేత కళాకారుల సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాయగడకు చెందిన ప్రేరణ స్కూల్ గురువు హిమాంశు శేఖర్ పాండియా శిష్యురాలైన సంజుక్త కుమారి సొరకాయ కళా నైపుణ్యానికి రాష్ట్రస్థాయి సన్మానం అందుకున్నారు. సంప్రదాయ కళారూపాలను పరిరక్షిస్తు వాటిని సృజనాత్మకంగా అభివృద్ధి చేస్తున్న కళాకారులను ప్రొత్సాహించడంలో భాగంగా సన్మానించి అభినందించారు.


