జయపురం: శ్రీకృష్ణ జయంతి మరునాడు ఏటా సంప్రదాయంగా జరుపుకొనే నందోత్సవాలు నేడు జయపురంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవంలో కొరాపుట్ జిల్లా షోహల్‌ఖండ్ గోపాల్ సమాజం సహకారంతో జయపురం గౌఢ సమాజ్ నిర్వహించిన నందోత్సవంలో నంద భక్తులు గౌఢ వీది నుంచి శోభాయాత్ర నిర్వహించారు. స్థానిక టౌన్ హాలుకు శోభాజాత్ర చేరుకున్న తరువాత సభా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి ముఖ్యఅతిదిగా పాల్గొన్నా రు. కొరాపుట్ జిల్లా షోహల్‌ఖండ్ గోపాల సమా జ్ అధ్యక్షులు మదన మోహణ నాయిక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రసంగిస్తూ శ్రీకృష్ణ జన్మాష్టమి మరునాడు గౌఢ సంప్రదాయ ప్రజ లు భక్తితో జరుపుకొనే నందోత్సవాలకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. శ్రీకృష్ణ భగవానుని జీవి తం, ఆయన తత్వం, గీతోపన్యాసం మనకు ధర్మా న్ని, సత్యాన్ని, మన కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ, మానవత్వ మార్గంలో మనల్ని ముందుకు నడిచేందుకు ప్రేరణ ఇస్తాయని అన్నారు. ఉత్సవంలో ఆర్గనైజింగ్ కార్యదర్శి పరమేశ్వర పాత్రో, కార్యదర్శి రాజేంద్ర కుమార్ గౌడ పాల్గొన్నారు. నందోత్సవాల సందర్భంగా గౌఢ సమాజ్ నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు ముఖ్యఅతిథి బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు.


