440 కిలోల గంజాయి పట్టివేత | - | Sakshi
Sakshi News home page

440 కిలోల గంజాయి పట్టివేత

Sep 6 2026 2:25 AM | Updated on Sep 6 2026 2:25 AM

నిందితులు పరార్‌

మల్కన్‌గిరి: గంజాయి అక్రమ రవాణా గుట్టురట్టయింది. ట్రాక్టర్‌లో గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడింది. ఈ సంఘటన మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి వెంకటాపాలెం వద్ద శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. కలిమెల పోలీసులు శుక్రవారం రాత్రి వెంకటాపాలెం పంచా యతీ సమీప అటవీ ప్రాంతానికి వెళ్లే రహదారిలో పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రవాణాకు సిద్ధంగా ఉన్న ఓ ట్రాక్టర్‌తోపాటు కొంతమంది వారికి తారసపడింది. దీంతో అనుమానంతో అక్కడికు వెళ్లగా..వీరి రాకను గమనించిన నిందితులు ట్రాక్టర్‌ను విడిచిపెట్టేసి అడవిలోకి పరారయ్యారు. పోలీసులు ట్రాక్టర్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేయగా అందులో గంజాయి ఉన్న కొన్ని బస్తాలు దర్శనమిచ్చాయి. వీటిని కలిమెల పోలీసుస్టేషన్‌కు తరలించారు. వీటిని శనివారం ఉదయం ఐఐసీ ప్రభుదత్తు సమక్షంలో తూకం వేయగా 440 కిలోలు ఉంది. దీని విలువ రూ.44 లక్షలు ఉంటుందని ఐఐసీ ప్రభు దత్తు తెలిపారు. కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నామని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement