పర్లాకిమిడి:
స్థానిక పీఎం శ్రీ మహారాజా బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం గురుదివాస్ వేడుకలు ఆడంబరంగా జరుపుకున్నారు. తొలుత సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు ప్రధాన ఉపాధ్యాయులు మోనాలిసాదాస్, జగన్నాథ పట్నాయిక్, సులతా శుభదర్శినీ వేశారు. అనంతరం విద్యాలయంలో పాఠాలు చెప్పి రిటైరైన ఆరుగురు ఉపాధ్యాయులు చెట్టి వేంకటేశ్వర్లు, ఎస్.లక్ష్మణరావు, కుముద రంజన్ దాస్, ప్రఫుల్ల చంద్ర పాణిగ్రాహి, సాత్మిక్‌పట్నాయిక్, బినోద్ చంద్ర జెన్నాలకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి వేదికపైకి ఆహ్వానించి దుశ్శాలువతో సన్మానించారు. వేదికమీద ఉన్న ఉపాధ్యాయులందరికీ విద్యార్థులు చందన తిలకం దిద్ది కండువాలు కప్పారు. అనంతరం గురుపూజోత్సవం సందర్భంగా విద్యార్థులకు గురువుల విలువలను తెలియజేశారు. కార్యక్రమం విద్యాలయం ప్రధాన ఉపాధ్యాయురాలు మోనాలిసా దాస్, ఉపాధ్యాయులు యం.సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగింది.


