రిటైనింగ్‌ వాల్‌ నిర్మించాలి | - | Sakshi
Sakshi News home page

రిటైనింగ్‌ వాల్‌ నిర్మించాలి

Sep 1 2026 3:00 AM | Updated on Sep 1 2026 3:00 AM

పర్లాకిమిడి: గజపతి జిల్లాలో కురుస్తున్న వర్షాలకు గుమ్మా బ్లాక్‌ అజయగడ–నమ్మనగుడ రహదారిలో కొండ చరియలు, మట్టి రోడ్డుకు అడ్డంగా పడుతున్నాయి. వాహనదారులు, బాటసారులు ఇబ్బంది పడుతున్నారు. గుమ్మఘాటిలో కొండచరియలు విరిగిపడుతున్నందున కొన్నిసార్లు రాకపోకలు బంద్‌ అవుతున్నాయి.

పీడబ్ల్యూడీ, రోడ్లు–భవనాల శాఖ ఇంజినీర్లు స్పందించి అజయగడ, నమ్మనగుడ రోడ్డులో రిటైనింగ్‌ వాల్‌, డ్రైనేజీ వ్యవస్థ నిర్మించాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. కేంద్ర, రాష్ట్ర డిజాస్టర్‌ సర్వే ప్రకారం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి గజపతి జిల్లాలో కొండచరియలు విరిగిపడే ప్రాంతాలను గుర్తించారు. వాటిలో గుమ్మ ప్రాంతంలో అతి ఎక్కువగా 59 గిరిజిన గ్రామాలు, 49 కిలో మీటర్లు రోడ్డు అతి ప్రమాదకరమైన కొండచరియలు విరిగిపడే జోన్‌గా గుర్తించారు. వెంటనే ప్రభుత్వం స్పందించి రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణానికి నిధులు కేటాయించాలని గుమ్మ ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement