జయపురం: పట్టణ ప్రజల సమస్యలను పరిష్కరించాలని సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సభ్యులు కోరారు. ఈ మేరకు కొరాపుట్ కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్‌కు అసోసియేషన్ అధ్యక్షుడు మీనకేతన్ ఆధ్వర్యంలో వినతిపత్రం శుక్రవారం అందజేశారు. ముఖ్యంగా పట్టణంలో ట్రాఫిక్ సమస్య పరిష్కరించేందుకు లక్ష్మీపండ కూడలి నుంచి గాంధీచౌక్ వరకు ఫ్‌లై ఓవర్‌ను నిర్మించాలని డిమాండ్ చేశారు. అలాగే సురక్షిత రవాణా కోసం ఫుట్‌పాత్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా వయోవృద్ధుల సౌకర్యం కోసం పాత బస్టాండ్ నుంచి జిల్లా కేంద్ర హాస్పిటల్, జయపురం రైల్వేస్టేషన్, విమానాశ్రయం వరకు బ్యాటరీలతో నడిచే వాహనాలను నడపాలని కోరారు. అదేవిధంగా కొరాపుట్ నుంచి పూరీ వెళ్తున్న రైలును జయపురం నుంచి పూరీ వరకు నడపాలని విన్నవించారు.


