వాణిజ్య విమాన సేవలపై సమీక్ష | - | Sakshi
Sakshi News home page

వాణిజ్య విమాన సేవలపై సమీక్ష

Aug 22 2026 1:47 AM | Updated on Aug 22 2026 1:47 AM

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి విమానాశ్రయం నుంచి వాణిజ్య విమాన సేవలను త్వరలో ప్రారంభించేందుకు అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా అధికారులు శుక్రవారం సమావేశమయ్యారు. ఒడిశా ముఖ్యమంత్రి చేతులు మీదుగా విమాన సేవలు అధికరికంగా ప్రారంభించడం కోసం జిల్లా కలెక్టర్‌ ప్రధమేశ్‌ అర్వింద్‌ రాజాశిర్క్‌తో చర్చించిన వాణిణ్య, రవాణా శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అధ్యక్షతన వర్చువల్‌గా సమావేశమై చర్చించారు. జిల్లా నుంచి ఇకపై విమానసేవలు సులభతారం చేయడం కోసం జిల్లా అదనపు కలెక్టర్‌ వేద్బ్‌ర్‌ ప్రధాన్‌, పిప్యూటీ కలెక్టర్‌ స్వయం సిద్ద రౌత్‌ సహా పలువురు సీనియర్‌ అధికారులు విమానాశ్రయంలోని ఏర్పాట్లు, సమన్వయాన్ని సమీక్షించారు. ప్రాథమిక దశలో ఆర్‌సీఎస్‌ ఉడాన్‌ పథకం కింద నాన్‌ షెడ్యూల్డ్‌ వాణిజ్య విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఇండియావన్‌ ఎయిర్‌ సంస్థకు చెందిన తొమ్మిది సీట్ల సామార్ధ్యం ఉన్న విమానం సేవలు అందించనుంది. ప్రయాణికులు టికెట్‌ బుకింగ్‌, ఇతర సహాయం కోసం జిల్లా కలెక్టర్‌ కార్యాయం ప్రాంగణంలో ప్రత్యేక సెల్‌ను ఏర్పా టు చేస్తున్నారు. విమాన సేవలు ప్రారంభమైంటే జిల్లా రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు వ్యాపారం, పర్యాటకుల, ప్రజల రాకపోకల్లో మార్పులు వస్తాయని అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement